
క్యాన్సర్ అనే పేరు వింటేనే చాలా మంది హడలెత్తిపోతారు. ఈ ప్రాణాంతక వ్యాధి ఒక్కసారి సోకితే ఎవరినీ అంత త్వరగా వదిలిపెట్టదు. క్యాన్సర్‌లలో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి. ముఖ్యంగా పురుషుల్లో ప్రాణాంతకమైనది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ 50 ఏళ్లు పైబడిన వారిలో అధికంగా వస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. పురుషులలో మూత్రాశయం క్రింద ఉన్న ప్రోస్టేట్ గ్రంథిలో సంభవించే ప్రాణాంతక వ్యాధి.. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్. అసలు ఇది ఎందుకు వస్తుందో నిపుణుల మాటల్లో మీ కోసం..
పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్. ప్రోస్టేట్ క్యాన్సర్ మూత్రాశయం క్రింద ఉన్న పురుష పునరుత్పత్తి గ్రంథి అయిన ప్రోస్టేట్ గ్రంథిలో సంభవిస్తుంది. ఈ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్ దారితీస్తుంది. ప్రారంభ దశలో దాని లక్షణాలను గుర్తించడం కష్టం. కానీ సకాలంలో గుర్తిస్తే సరైన చికిత్సతో వ్యాధిని నయం చేయవచ్చు.
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రారంభ దశలోనే సరైన చికిత్స తీసుకుంటే నయం చేయవచ్చు. PSA రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ పరీక్షతో సహా ఇతర పరీక్షల ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తికి వైద్యులు రేడియోథెరపీ, సర్జరీ, ఆండ్రోజెన్ డిప్రెవియేషన్ థెరపీతో సహా అనేక రకాల చికిత్సా పద్ధతుల ద్వారా ట్రీట్‌మెంట్ ఇస్తారు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.