Potato For Hair : చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం.. బంగాళాదుంపతో ఇలా చేస్తే.. మీ జుట్టు పెరుగుతుంది!

|

Feb 28, 2024 | 5:53 PM

బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును, బంగాళాదుంప రసం చర్మం, జుట్టు సమస్యలకు సులభమైన పరిష్కారం. బంగాళాదుంప రసాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక చర్మ, జుట్టు సమస్యలను నయం చేయవచ్చు.

Potato For Hair : చుండ్రు సమస్యకు శాశ్వత పరిష్కారం.. బంగాళాదుంపతో ఇలా చేస్తే.. మీ జుట్టు పెరుగుతుంది!
Potato For Hair
Follow us on

చుండ్రు అనేది సాధారణంగా వచ్చే సమస్య.. ఇది పరిష్కరించలేని సమస్య కాదు.. దీనికి చాలా సహజసిద్ధమైన హోం రెమెడీస్ ఉన్నాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంతో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. .. కాబట్టి, అలాంటి సహజ పరిష్కారం ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం..

కూరగాయలు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి శరీరం అంతర్గత ఆరోగ్యానికే కాకుండా బాహ్య సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. ఇక అన్ని కూరగాయలలో బంగాళాదుంప అత్యంత బహుముఖ కూరగాయలలో ఒకటి… ఏ రకమైన వంటకైనా అనుకూలం. ఇది మానవ జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

బంగాళదుంపలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందించడమే కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును, బంగాళాదుంప రసం చర్మం, జుట్టు సమస్యలకు సులభమైన పరిష్కారం. బంగాళాదుంప రసాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక చర్మ, జుట్టు సమస్యలను నయం చేయవచ్చు. అందంగా, ఆరోగ్యంగా, పొడవాటి జుట్టును పొందాలంటే పెద్దగా ఖర్చు చేయనవసరం లేదు.. మీ ఇంటి వంటగదిలో ఒక బంగాళదుంప చాలు.

ఇవి కూడా చదవండి

అరకప్పు బంగాళదుంప రసం తీసుకుని అందులో 1 నుంచి 2 చెంచాల అలోవెరా జెల్, 2 చెంచాల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి.. జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత అరగంట అలాగే ఉంచి షాంపూతో కడిగేయాలి.

బంగాళదుంపతో హెయిర్‌ కేర్‌ కోసం మరో రెసీపీ కూడా ఉంది.. ఇందుకోసం కొన్ని ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. తర్వాత బంగాళాదుంపను తీసుకుని దానిపై పొట్టు తీసేసి.. ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలుపుకుని మొత్తటి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకూ పట్టించాలి. ఆరిన తర్వాత.. షాంపూ వాడకుండా తలస్నానం చేయాలి. ఆ తర్వాతి రోజు షాంపూ వాడొచ్చు.

ఇలా బంగాళాదుంపతో చేసిన మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు మీ జుట్టుకు వాడుతూ ఉంటే..పలుచగా మారిన జుట్టు ఒత్తుగా మారుతుంది. ఈ చిట్కాతో చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి. వారానికి రెండుసార్లు ఈ చిట్కా పాటిస్తే.. మంచి ఫలితం పొందవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..