Potato Farming: కూరగాయల్లో (Vegetables) దుంపకూరైన(Root Vegetables) బంగాళాదుంపకు స్పెషల్ స్థానం ఉంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరును బంగాళాదుంపతో చేసిన ఆహారపదార్ధాలను ఇష్టంగా తింటారు. అందుకనే బంగాళాదుంపను కూరగాయలలో రారాజు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది లేకుండా వంటగదిలో చేసిన ప్రతి కూరగాయలు అసంపూర్ణంగా ఉంటాయి. అంతేకాదు ఈ బంగాళా దుంపలు లభించడానికి సీజన్ తో సంబంధం లేదు. కూరలు, ఫ్రైస్, బిర్యానీ, చిప్స్ ఇలా రకరకాల ఆహారాన్ని తయారు చేస్తారు. అయితే ఇప్పటి వరకూ ఈ దుంప కూర పొలంలో మట్టిలో పండుతుందని తెలుసు. అయితే గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి అద్భుతం చేశాడు. తన డాబా మీద, కిచెన్ గార్డెన్‌లో మట్టి అవసరం లేకుండా బంగాళదుంపలు పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..
సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలో నివసించే సుభాష్ వృత్తిరీత్యా ఇంజనీర్. అయితే అతనికి రకరకాల మొక్కలను పెంచడం అభిరుచి. దీంతో తన ఇంటి టెర్రస్ నే వ్యవసాయ క్షేత్రంగా మలుచుకున్నారు. తన ఇంటి టెర్రస్ గార్డెన్‌లో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ.. రకరకాల కూరగాయలు పండిస్తున్నాడు. అయితే మట్టి లో మాత్రమే పండే బంగాళా దుంపను తాను కూడా తన గార్డెన్ లో పండించాలనుకున్నాడు. ఇన్ని కాయగూరల నడుమ సుభాష్ వినూత్నంగా అలోచించి దుంపను గాలిలో పెంచసాగాడు. ఇది అడవి పండు. బంగాళాదుంపలా కనిపిస్తుంది. మట్టి అవసరం లేకుండా తీగపై పెరుగుతుంది. నిజానికి పొటాటో భూమికింద నేలలో పెరిగే కూరగాయ.
బంగాళదుంపల వ్యవసాయం
సుభాష్ కు ప్రయాణాలు చేయడం అంటే ఇష్టం. ఒకసారి సౌరాష్ట్రలోని గిర్ అడవులకు వెళ్ళినప్పుడు బంగాళాదుంప విత్తనాలను తీసుకొచ్చాడు. ఈ గాలి బంగాళాదుంపలు కొండప్రాంతాల్లో, అడవుల్లో వాటంతట అవే పెరుగుతాయి. ఈ గాలి పొటాటో వృక్షశాస్త్ర నామం డియోస్కోరియా బల్బిఫెరా.
ప్రస్తుతం ఇంటి పై టెర్రస్ పై ఎటువంటి మట్టి అవసరం లేకుండా గాలికి పెరుగుతున్న బంగాళాదుంప పంట గురించి ప్రస్తుతం సర్వత్రా చర్య జరుగుతుంది. అంతేకాదు.. సుభాష్ ఇంటికి ఈ బంగాళా దుంపలను చూడడానికి క్యూలు కడుతున్నారు. దీని డిమాండ్ కూడా పెరుగుతోంది.
అడవిలో, ఈ హవాయి బంగాళాదుంపలు రసాయనాలు లేదా ఎరువులు ఉపయోగించకుండా పెరుగుతాయి. అంతేకాదు వీటి పెంపకానికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. దీని తీగ సంవత్సరానికి చాలాసార్లు దాని ఫలాలను ఇస్తుంది. సూరత్‌లోని నగరంలో నివసించే సుభాష్.. నగరంలో అటవీ బంగాళదుంపలను పండిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
Akshaya Tritiya 2022: మీరు అక్షయ తృతీయ రోజున బంగారు నాణేలు కొంటున్నారా.. ఈ 5 విషయాలను తెలుసుకోండి