AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతి ప్రసాదం.. మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. పురుషులకైతే వరమే..

పొన్నగంటి కూర తెలుగు ఇళ్లలో ప్రసిద్ధి చెందిన ఆకుకూరల్లో ఒకటి. ఇందులో బీటా కెరోటిన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, విటమిన్లు, పొటాషియం వంటి పలు పోషకాలు ఉంటాయి. సమతుల ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించుకోవచ్చు. ముఖ్యంగా కంటి ఆరోగ్యం, జీర్ణక్రియ వంటి అంశాల్లో దీని పోషక విలువలు ఉపయోగపడవచ్చు.

ప్రకృతి ప్రసాదం.. మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్.. పురుషులకైతే వరమే..
Ponnaganti Kura Health Benefits
Shaik Madar Saheb
|

Updated on: Sep 08, 2026 | 3:34 PM

Share

ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి పొన్నగంటి కూర ఒక అద్భుతమైన ఎంపిక. ఆకుకూరల్లో అద్భుతమైన పోషకాలు కలిగినది పొన్నగంటి కూర. అనారోగ్యాల నుండి మనల్ని రక్షించేందుకు, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి ఆరోగ్యానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంటున్నారు.

పొన్నగంటి పోషకాల నిధి:

పొన్నగంటి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లతో పాటు, విటమిన్ ఎ, బి6, సి, ఫోలేట్, రైబోఫ్లేవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ వ్యవస్థల సరైన పనితీరుకు అవశ్యకం.

పొన్నగంటి కూర ప్రయోజనాలు..

రక్త శుద్ధి – వృద్ధి: పొన్నగంటి కూరలో ఉండే అనేక పోషకాలు మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇది రక్తం బాగా తయారయ్యేలా ప్రోత్సహిస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. తద్వారా రక్తహీనత సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: అధిక శరీర వేడి, తలనొప్పి తగ్గడానికి పొన్నగంటి ఆకుల నుండి తయారైన తైలం ఉపయోగిస్తారు. ఇది శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉండడంతో ఒంట్లో వేడికి మంచి ఉపశమనం లభిస్తుంది. 48 రోజుల పాటు క్రమం తప్పకుండా పొన్నగంటి ఆకుకూర తింటే శరీరానికి అవసరమైన ఖనిజాలు, పోషకాలు అధిక మోతాదులో అందుతాయి.

చర్మ సౌందర్యం – బరువు నియంత్రణ: పొన్నగంటి కూర చర్మ సౌందర్యాన్ని పెంపొందించడంలో బాగా సహాయపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగి ఆరోగ్యకరమైన బరువును సాధించవచ్చు. బరువు పెరగాలనుకునేవారు కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.

కంటి ఆరోగ్యం: ఇది కంటిచూపును పెంచుతుంది, కంటి సమస్యలను తగ్గిస్తుంది. పొన్నగంటి కూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. రోజూ కంప్యూటర్ల ఎదుట కూర్చుని పని చేసేవారు ఈ కూరను తినడం వల్ల కళ్ళను సంరక్షించుకోవచ్చు, కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది. మధుమేహుల్లో ఈ కూర కంటిచూపు తగ్గకుండా చూడటంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ – కొలెస్ట్రాల్ నియంత్రణ: జీర్ణ సమస్యలు ఉన్నవారు పొన్నగంటి కూరను తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పొన్నగంటి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ లు రాకుండా నిరోధిస్తుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

ప్రోటీన్లు: పొన్నగంటి కూరలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారం తినలేని వారికి ఇది ఒక ఉత్తమ ప్రోటీన్ వనరు.

డయాబెటిస్ నియంత్రణ: డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఈ కూరను తినడం వల్ల షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు. ఇది కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది.

శ్వాసకోశ సమస్యలు: ఆస్తమా, బ్రాంకైటిస్ తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.

జుట్టు ఆరోగ్యం: జుట్టుకు పోషణ ఇచ్చే బయోటిన్ ఇందులో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

క్యాన్సర్ నివారణ: పొన్నగంటి కూరను రోజూ తింటుంటే పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. చర్మం, ఎముకలు తదితర క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడుతుంది.

పురుషుల సంతానోత్పత్తి: పొన్నగంటి కూరను రోజూ తింటే వీర్యకణాల్లో ఉండే లోపం తగ్గుతుంది.. వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. దీంతోపాటు వీర్యం ఎక్కువగా తయారవుతుంది. దీనివల్ల పురుషులకు సంతానం కలిగే అవకాశాలు మెరుగుపడతాయి.

మొలల సమస్య: రెండు టేబుల్ స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు నెల రోజుల పాటు తీసుకుంటే మొలల సమస్య తగ్గిపోతుంది.

ఆయుర్వేద ఔషధంలో అనేక రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పొన్నగంటి కూరను ఉపయోగిస్తారు. సంక్షిప్తంగా, పొన్నగంటి కూర సమగ్ర ఆరోగ్యాన్ని అందించే అద్భుతమైన ఆకుకూర. దీనిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించి, దీర్ఘాయువును పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us