AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple: వేసవిలో పైనాపిల్‌ తినొచ్చా? అసలు ఇది ఆరోగ్యానికి మంచిదేనా..

వేసవిలో చాలా మంది పండ్ల రసం తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఈ సీజన్‌లో పైనాపిల్ జ్యూస్ తయారు చేసి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పైనాపిల్ మంచిదనే అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6..

Pineapple: వేసవిలో పైనాపిల్‌ తినొచ్చా? అసలు ఇది ఆరోగ్యానికి మంచిదేనా..
Pineapple
Srilakshmi C
|

Updated on: May 19, 2025 | 1:21 PM

Share

రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో చాలా మంది పండ్ల రసం తయారు చేసుకుని తాగుతుంటారు. కానీ ఈ సీజన్‌లో పైనాపిల్ జ్యూస్ తయారు చేసి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పైనాపిల్ మంచిదనే అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, పొటాషియం, ఫోలేట్, ఫైబర్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

పైనాపిల్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పైనాపిల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది తీవ్రమైన, ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జీర్ణ సమస్యలను తొలగిస్తుంది

పైనాపిల్‌లో ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీని వినియోగం ఆకలిని తగ్గిస్తుంది. అజీర్ణంతో సహా అనేక కడుపు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

కంటి చూపును మెరుగుపరుస్తుంది

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అధికంగా ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీని వాడకం వల్ల కంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అందువల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పైనాపిల్ తినడం మంచిది. ఇందులో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది

పైనాపిల్‌లో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల ఈ పండు తినడం వల్ల ఎముకలు బలపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

ఈ పండు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని వినియోగం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. మంచి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.

చర్మం – జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది

పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఈ పండు తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. జుట్టు ఒత్తుగా, సిల్కీగా పెరుగుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.

Follow Us
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
ఆ ఒక్క సీన్.. దెబ్బకు లైఫ్ మారిపోయింది..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
రైతులకు ఇది కదా కావాల్సింది.. ఎన్నో ఏళ్ల సమస్యకు రేవంత్ సర్కార్..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
చికెన్, మటన్‎ను మైమరిపించే పచ్చి బొప్పాయి కూర..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
యూవర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్‌డేట్..
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
నాణెంపై చిన్న గుర్తు..పెద్ద సీక్రెట్! ఎక్కడ తయారైందో ఇలా తెలుసుకో
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
రెండో టైటిల్‌పై కన్నేసిన గుజరాత్.. ట్రోఫీ అందించే X-ఫ్యాక్టర్స్
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన రూ.460 కోట్లు బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
శ్రీరామనవమి నుంచి.. వీరి దశ తిరిగినట్టే.. మీరున్నారా?
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
మహిళలకు ప్రతి నెలా రూ.2500.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..
కవిత కొత్త పార్టీపై క్లారిటీ.. మూహూర్తం ఖరారు! కసరత్తు ముమ్మరం..