
మనం మన దైనందిన జీవితంలో చాలా మందిని కలుస్తాము. అలా మనల్ని కలిసిన వ్యక్తులలో కొంతమందిని ఇష్టపడతాం.. మరికొందరిని దూరంగా ఉంచుతాం.. అది వ్యక్తుల పట్ల ప్రవర్తన, వైఖరి ఆధారంగా దగ్గరగా ఉంచాలో.. దూరంగా పెట్టాలో నిర్ణయించుకుంటాం. అది వారి వ్యక్తిత్వం ఆధారంగా నిర్ణయించుకుంటాం. మనిషి వ్యక్తిత్వాన్ని .. వ్యక్తి స్వభావం, ప్రవర్తనతో పాటు, శరీర భాగాలు కూడా వెల్లడిస్తాయి. ఒక వ్యక్తి వేళ్ల ఆకారం కూడా అతని రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది. ఉంగరపు వేలు పొడవు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఉంగరపు వేలు ఏ విధంగా ఉంటే.. ఎటువంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటే: కొంతమందికి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొడవుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ప్రేమతో నిండి ఉంటారు. ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. వీరిలో అతి విశ్వాసం కనిపిస్తుంది. ఈ గుణమే అందరినీ ఆకర్షిస్తుంది. ఈ వ్యక్తులు సాహసోపేతంగా ఉంటారు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ప్రవర్తిస్తారు. వీరిలో సమస్యను పరిష్కరించే నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు సంతోషకరమైన జీవితాన్ని గడపడం ద్వారా తమ కుటుంబాన్ని, జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచుతారు. తమ భాగస్వామిని సంతోషపెట్టడానికి వీరు ఏమీ చేయడానికి అయినా సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొట్టిగా ఉంటే: కొంతమందికి ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే పొట్టిగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు స్వతహాగా మంచివారు. నమ్మదగినవారు. అయితే వీరు తరచుగా చెడు సహవాసం చేస్తారు. వీరు ఎక్కువ సంయమనంతో, ఆత్మపరిశీలన కలిగి ఉండడం మంచిది. వీరు అందరితో గౌరవింపబాడతారు.. అయినా సరే ఒకొక్కసారి ఆలోచనా రహితంగా చేసే పనుల వలన వీరు ఎక్కువగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అంతేకాదు తొందరపాటు నిర్ణయాలతో తమ చేతికి అంది వచ్చిన అవకాశాలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చూపుడు వేలు, ఉంగరపు వేలు ఒకే పొడవులో ఉంటే: ఉంగరపు వేలు .. చూపుడు వేలు ఒకే రేఖలో అంటే ఒకే పొడవుగా ఉంటే.. ఇది సమతుల్య వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఈ వ్యక్తులు నమ్మకంగా ఉంటారు. సామరస్యపూర్వక జీవితాన్ని గడుపుతారు. ఈ గుణం వీరిని సామాజిక, వృత్తిపరమైన రంగాలలో సక్సెస్ అయ్యేలా చేస్తుంది. వీరు ఎంత మంది మధ్యలో ఉన్నా వీరి మాటలకు పది మంది విలువ ఇస్తారు. తరచుగా తమ చుట్టూ ఉన్నవారికి సలహా ఇస్తారు. జీవితంలో ఏదైనా ఎంపిక చేసుకోవాలి అనుకుంటే వీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలను తీసుకుంటారు. ఏదైనా క్లిష్ట పరిస్థితిలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. అస్థిర మానసిక స్థితి కారణంగా సరైన నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..