Personality Test: అబద్దాలు చెప్పే వారి ప్రవర్తన ఇలా ఉంటుంది.. చిటికెలో కనిపెట్టేయొచ్చు!

అబద్ధం చెప్పడం కూడా ఒక కళ. కానీ కొంతమందికి తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటి లేదా రెండు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఇవి అవసరం కోసం చెప్పేవి. వీటి వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ మరికొంతమంది మాత్రం మాట్లాడేటప్పుడు అబద్ధాలు ప్రవాహంలా వస్తాయి. తమ లక్ష్యాన్ని సాధించడానికి అబద్ధాలను అస్త్రాలుగా ఉపయోగిస్తారు. వీరు చాలా డేంజర్‌. వీలైనంత వరకు వీరికి దూరంగా ఉండటమే బెటర్‌..

Personality Test: అబద్దాలు చెప్పే వారి ప్రవర్తన ఇలా ఉంటుంది.. చిటికెలో కనిపెట్టేయొచ్చు!
People Who Lie Have These Habits

Updated on: Feb 05, 2025 | 8:56 PM

ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. కానీ వ్యక్తిత్వమే సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబడటానికి సహాయపడుతుంది. కానీ మన చుట్టూ ఉన్న కొంతమంది ప్రతిదీ బహిరంగంగా, స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది సానుభూతి పొందడానికి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకుంటారు. అయితే ఒక వ్యక్తి నిజం చెబుతున్నాడో.. అబద్ధం చెబుతున్నాడో.. తెలుసుకోవడం అంత కష్టం కాదు. అవును.. ఈ కింది లక్షణాలు ఉన్న వారు తరచుగా అబద్ధాలు చెబుతుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీటిని బట్టి అబద్ధం చెప్పే వ్యక్తులను సులభంగా గుర్తించవచ్చు.

ముఖ కవళికలలో మార్పు

అబద్ధం చెప్పే వ్యక్తిని గుర్తించడానికి సులభమైన మార్గం వారి ముఖ కవళికలను గమనించడం. ఈ వ్యక్తులు అబద్ధం చెప్పడానికి భయపడటం వలన మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూడలేరు. దీంతో ముఖ కవళికలలో మార్పులు స్పష్టం కనిపిస్తాయి. సంభాషణల మధ్యలో వారి దృష్టి ఎక్కడెక్కడో ఉంటుంది. కొన్నిసార్లు వారు విషయాలను పూర్తిగా వివరించకుండానే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తారు.

అతిశయోక్తి చేయడం

అబద్ధం చెప్పే వ్యక్తులకు ఉన్న మరో పెద్ద అలవాటు ఏమిటంటే, ఏ విషయమైనా అతిశయోక్తి చేయడం. అంటే గోరంతలను కొండంతలుగా చెప్పడం. ఎవరైనా వారితో సాధారణంగా మాట్లాడాలనుకున్నా, వారు ఆ విషయాలను అతిశయోక్తి చేసి చప్తారు. అది వారి ముందు ఉన్న వ్యక్తికి ఆసక్తిని కలిగిస్తుంది. కానీ వారు చెప్పేది మాత్రం పూర్తిగా అబద్ధం.

భావోద్వేగాలను మార్చడం

అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఇతరులను మోసగించడానికి భావోద్వేగాలను ఉపయోగిస్తారు. వారు తమ వ్యక్తిగత లాభం కోసం భావోద్వేగాలను ఆయుధంగా ఉపయోగిస్తారు. వారు ఇతరుల సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారు ఎప్పుడైనా పట్టుబడే అవకాశం ఉంది. కానీ వారు మాత్రం తమ పని పూర్తి చేసేందుకు ఎప్పుడైనా ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదం.

మాట్లాడే స్వరంలో హెచ్చుతగ్గులు

అబద్ధం చెప్పే వ్యక్తులు బిగ్గరగా లేదా చాలా మృదువుగా మాట్లాడతారు. తమ ముందు ఉన్నవారితో మాట్లాడేటప్పుడు, గొంతు సహజంగా వినబడదు. ఎవరికీ ఏమీ చెప్పకూడదనుకున్నట్లుగా గుసగుసగా చెబుతారు.

అర్ధంలేనిది వాగ్ధానాలు

ఇలాంటి వ్యక్తుల నోటిలో నిజం కంటే అబద్ధాలే ఎక్కువ. దాచిన సత్యాలకు లెక్కే ఉండదు. వారి ముందు ఉన్న వ్యక్తి ఏదైనా చెబితే, వారు కూడా దానికి సంబంధించినదే చెప్పడం ప్రారంభిస్తారు. కానీ దానికి ప్రధాన అంశంతో సంబంధం ఉండదు. వారి మాటలు పూర్తిగా అర్థంలేనివి. మీ చుట్టూ ఉన్న వారిలో ఇలాంటి వాళ్లు ఖచ్చితంగా ఉంటారు. వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తమ ఎదుగుదల కోసం ఎందటి దారుణానికైనా తెగబడే నీచులు వీళ్లు.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.