మునగ వీరికి విషంతో సమానం.. ముట్టుకుంటే బండి షెడ్డుకే!

మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. మునగ సాధారణంగా దాదాపు అన్ని సీజన్లలో లభిస్తుంది. దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వివిధ కూరలు, సూప్‌లు, సాంప్రదాయ వంటకాలలో..

మునగ వీరికి విషంతో సమానం.. ముట్టుకుంటే బండి షెడ్డుకే!
Drumsticks Side Effects

Updated on: Dec 22, 2025 | 9:09 PM

మునగ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, ఖనిజాలు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వివిధ ప్రయోజనాలను పొందవచ్చు. మునగ సాధారణంగా దాదాపు అన్ని సీజన్లలో లభిస్తుంది. దీని రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా వివిధ కూరలు, సూప్‌లు, సాంప్రదాయ వంటకాలలో ఉపయోగిస్తుంటారు. మునగ కాయలేకాదు దీని ఆకుల్లో కూడ సహజంగా లభించే ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటాయి. మునగ కాయ జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, వాపుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఔషధ గుణాల కారణంగా వంటల్లో విస్తృతంగా వినియోగిస్తుంటారు. కానీ మునగతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది ఆరోగ్యానికి ఇది అస్సలు మంచిది కాదు. ఇలాంటి వారు మునగ వంటకాలు తినడం కోరి సమస్యలను కొని తెచ్చుకోవడమే. మునగ వంటకాలు తినాలా? వద్దా? అనేది ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మునగ ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

మునగ ఎవరికి డేంజరో తెలుసా?

  • గర్భిణీలు మునగ తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గర్భధారణ సమయంలో అసౌకర్యం, సమస్యలకు దారితీస్తుంది.
  • అలాగే పీరియడ్స్‌ సమయంలో అధిక రక్తస్రావంతో ఇబ్బంది పడే స్త్రీలు కూడా మునగ తినకుండా ఉండాలి. దీనిలోని వేడి లక్షణాలు రక్తస్రావాన్ని మరింత పెంచుతాయి. అంతేకాకుండా శరీరంలో బలహీనత, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి.
  • మునగ సహజంగానే రక్తపోటును తగ్గిస్తుంది. అయితే ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులు ఈ కూరగాయను తినకూడదు. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.
  • తలతిరగడం, అలసట వంటి లక్షణాలతో బాధపడే వారు కూడా మునగ కాయల వినియోగాన్ని పరిమితం చేయాలి.
  • దీర్ఘకాలిక జీర్ణ సమస్యలతో బాధపడేవారు మునగ ఎక్కువగా తినకూడదు. వీటిని పరిమితంగా తీసుకోవాలి లేదంటే పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్, శక్తి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందిలో ఉబ్బరం, ఆమ్లత్వం, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి మునగ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.