Lifestyle: మీ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి పంపిస్తున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

సమ్మర్ మొదలైంది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు సెలవులు కూడా రానున్నాయి. దీంతో చిన్నారులకు రకరకాల యాక్టివిటీస్‌ నేర్పించేందుకు పేరెంట్స్ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్విమ్మింగ్ పూల్స్. మండుటెండల్లో హాయిగా స్విమ్మింగ్ చేస్తే అటు ఎండ వేడిని తట్టుకోవచ్చు అలాగే...

Lifestyle: మీ పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి పంపిస్తున్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Swimming Pool

Updated on: Mar 18, 2024 | 3:55 PM

సమ్మర్ మొదలైంది. మరికొన్ని రోజుల్లో స్కూళ్లకు సెలవులు కూడా రానున్నాయి. దీంతో చిన్నారులకు రకరకాల యాక్టివిటీస్‌ నేర్పించేందుకు పేరెంట్స్ ఇంట్రెస్ట్‌ చూపిస్తుంటారు. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్విమ్మింగ్ పూల్స్. మండుటెండల్లో హాయిగా స్విమ్మింగ్ చేస్తే అటు ఎండ వేడిని తట్టుకోవచ్చు అలాగే ఇటు మంచి వ్యాయామం చేసినట్లు కూడా అవుతుంది. అయితే పిల్లల్ని స్విమ్మింగ్ పూల్‌కి పంపించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ‘స్విమ్మింగ్ పూల్‌లో మునిగి పోయి చిన్నారి మృతి’ ఇలాంటి వార్తలు ప్రతీ ఏటా వింటూనే ఉంటాం. అయితే ఇలాంటి దారుణాలు జరగకూడదంటే ముందుగా స్విమ్మింగ్ పూల్‌ను పూర్తిగా పరిశీలించాలి. నిర్వాహకుల గురించి ఆరా తియ్యాలి. అలాగే స్విమ్మింగ్ పూల్‌ లో ఎంత మంది స్టాఫ్‌ ఉన్నారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారు లాంటి వివరాలను పరిగణలోకి తీసుకోవాలి.

* అలాగే స్విమ్మింగ్‌ పూల్‌లో ఎలాంటి నీరును ఉపయోగిస్తున్నారు అన్న విషయాన్ని కూడా పరిశీలించాలి. బాగా ఉప్పుగా ఉన్న నీళ్లు, ఎక్కడో చెరువుల నుంచి తీసుకొచ్చిన నీరు ఉపయోగిస్తే అలాంటి వాటిని లైట్‌ తీసుకోవడమే ఉత్తమం.

* అలాగే స్విమ్మింగ్ పూల్ శుభ్రంగా ఉందా లేదా అన్న విషయాన్ని కూడా చూడాలి. స్విమ్మింగ్ పూల్‌లో అడుగున ఉన్న భాగం స్పష్టంగా కనిపించాలి. అప్పుడే ఆ నీరు స్వచ్ఛమైందని గుర్తించాలి.

* ఇక స్విమ్మింగ్ పూల్‌లోకి వెళ్లే ముందు చిన్నారులకు చర్మ సంబంధిత పరీక్షలు చేయిస్తున్నారా లేదా అన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒకవేళ ఎవరికైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుందని గుర్తించుకోవాలి.

* అలాగే పూల్‌లోని నీటిని క్లోరిన్‌తో శుభ్రం చేస్తున్నారా లేదా అన్ని విషయాన్ని కూడా గమనించాలి. నీరు నాణ్యతగా లేకపోతే అనవసరంగా చిన్నారులకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..