Parenting Tips: ప్రయాణంలో మీ పిల్లలు తరచుగా ఏడుస్తున్నారా? అయితే వారిని ఇలా ఈజీగా కూల్ చేయండి..

చాలా మంది ప్రయాణం అంటే ఎలాగోలా గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ గమ్యాన్ని చేరుకుంటారు.

Parenting Tips: ప్రయాణంలో మీ పిల్లలు తరచుగా ఏడుస్తున్నారా? అయితే వారిని ఇలా ఈజీగా కూల్ చేయండి..
Child Care Tips
Follow us

|

Updated on: Nov 18, 2022 | 9:53 AM

చాలా మంది ప్రయాణం అంటే ఎలాగోలా గమ్యాన్ని చేరుకోవాలని అనుకుంటారు. మరికొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ గమ్యాన్ని చేరుకుంటారు. అయితే, చిన్న పిల్లలు ఉనన తల్లిదండ్రులకు ప్రయాణం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం పిల్లల వేధింపులు. ప్రయాణ సాధనం ఏదైనా సరే.. పిల్లల నానారచ్చ చేస్తారు. ఏడుస్తూనే ఉంటారు. ఫలితంగా పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రుల్లో మీరు కూడా ఉన్నారా? మీ పిల్లలు ప్రయాణ సమాయంలో ఏడుస్తూ వేధిస్తున్నారా? వారి అల్లరి, ఏడుపును క్షణాల్లో మాయం చేసే చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బొమ్మలు..

ప్రయాణంలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు ఏడుస్తుంటారు. అలాంటి సమయంలో వారిని బుజ్జగించేందుకు బొమ్మలు అద్భుతంగా ఉపయోగపడుతాయి. సహజంగానే పిల్లలకు బొమ్మలంటే చాలా ఇష్టం. నచ్చిన బొమ్మలను పిల్లలకు ఇస్తే వారు ఏడవటాన్ని ఆపేస్తారు.

విమానం ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఇబ్బంది..

విమాన ప్రయాణం చేసేటప్పుడు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పిల్లలు కాస్త ఇబ్బందికి గురవుతుంటారు. ఆ సమయలో వారు బాగా ఏడుస్తుంటారు. అలా ఏడవకుండా ఉండేందుకు వారికి ఆహారం ఇవ్వాలి. వాస్తవానికి విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో చాలా శబ్ధం వస్తుంది. ఆ సమయంలో పిల్లల చెవుల్లో నొప్పిగా ఉండటం గానీ, ఆ శబ్ధానికి భయపడటం గానీ చేస్తారు. అలా ఏడవడం మొదలుపెడతారు. అలాంటి సమయంలో పిల్లలకు చనుబాలివ్వడం, ఆహారం ఇవ్వడం ద్వారా వారి మైండ్ డైవర్ట్ అవుతుంది. ప్రశాంతంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలో ప్రయాణం బెటర్..

పిల్లలు నిద్రపోయే సమయంలో ప్రయాణం చేయడం చాలా బెటర్ అని చెప్పొచ్చు. పిల్లలు పెద్ద పెద్ద శబ్ధాలను విన్నా, జనాలు గుంపులుగా ఉన్నా భయాందోళనకు గురవుతారు. అందుకే.. వారి నిద్రపోయే సమయంలో జర్నీ చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు.

కోపం వద్దు..

పిల్లల ఏడుపు సమస్య.. తల్లిదండ్రులనే కాదు, చుట్టుపక్కన ఉన్న ప్రయాణికులను కూడా బాధపెడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలపై కోపం తెచ్చుకుంటారు. అది పిల్లలు మరింత ఏడ్చేలా చేస్తుంది. అందుకే.. పిల్లలు ఏడుస్తున్నప్పుడు కోపగించుకోకుండా.. ప్రశాంతంగా ఉండాలి. పిల్లలను శాంతింపజేసే ప్రయత్నం చేయాలి. వారిని లాలించి, ఆడించి, బుజ్జగించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో