తల్లిదండ్రుల నుంచి పిల్లలు చాలా విషయాలను నేర్చుకుంటారు. వారినే తమ రోల్ మోడల్స్‌గా భావిస్తారు. తల్లి లేదా తండ్రి అలవాట్లను అవలంభించుకోవడం.. లేదా వారిని అనుకరించడం వంటివి పిల్లలు అప్పుడప్పుడూ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మంచి విషయాలను పిల్లలకు చెబుతుండాలని సైకాలజిస్టులు అంటున్నారు. పిల్లలు ముందు తల్లిదండ్రులు ఈ 5 పనులు అస్సలు చేయకూడదని.. ఒకవేళ అవి చేస్తే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. మరి మానసికంగా పిల్లలపై ప్రభావం చూపించే ఆ విషయాలేంటో చూద్దాం పదండి.!
మీరు తరచూ పిల్లల ముందు గొడవపడుతుంటే.. వారి ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ గొడవలకు తామే కారణమని భావిస్తూ తమను తాము నిందించుకోవడం మొదలు పెడతారు. అది అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీ మధ్య ఏదైనా గొడవ తలెత్తితే.. దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. పిల్లల ముందు గొడవ పడకుండా శాంతియుతంగా మాట్లాడుకుని ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోండి.
మీ భాగస్వామిని మానసికంగా హింసించినా.. లేదా శారీరికంగా హింసించినా.. అలాంటి ఘటనలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించకూడదు. అలా కానిచో పిల్లలు పెద్దయ్యాక డ్రగ్స్ లేదా మద్యానికి బానిసయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం తప్పు కాదు. కానీ దానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఏ విషయంలోనూ పిల్లలపై బలవంతంగా ఒత్తిడి తీసుకురావద్దు. ఒకవేళ అలా చేస్తే వారిలో మార్పు మొదలవుతుంది. మెల్లి మెల్లిగా మీకు దూరమవ్వడం మొదలుపెడతారు. కఠినమైన క్రమశిక్షణ పిల్లల మనస్సుపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
చికాగో యూనివర్సిటీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. సామాజిక వ్యతిరేకత కలిగిన తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలు కూడా అదే అలవాట్లు అవలంభిస్తారని తెలుస్తోంది. వారి పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు క్షీణించే అవకాశం ఉందట.
తల్లిదండ్రులు తమ ఒత్తిడిని లేదా మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కుంటారో.? వారిని చూసే పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఒకవేళ మీరు త్వరగా చిన్న చిన్న విషయాలకు కలత చెందుతూ.. తరచూ ఒత్తిడికి గురైతే.. మీ పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోలేరు. పిల్లలకు వారి తల్లిదండ్రులే రోల్ మోడల్స్.. మంచి విషయమైనా, చెడ్డ విషయమైనా వారి నుంచే నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తమ పిల్లలకు ఓ ఎగ్జాంపుల్‌గా నిలవాలి.
Also Read: