
భారతీయ వంటగదిలో లభించే కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఆహార రుచిని పెంచడమే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తాయి. ఉల్లిపాయలు వాటిలో ఒకటి వీటిని అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. సోడియం, పొటాషియం, ఫోలేట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఉల్లిపాయల లక్షణాలు శరీరాన్ని అనేక సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మీరు శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే ఉల్లిపాయ బెస్ట్ రెమిడీ అవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఉల్లిపాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలు, దీన్ని ఎవరు ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు అధిక రక్తపోటు సమస్యతో ఆందోళన చెందుతుంటే మీరు ఉల్లిపాయ జ్యూస్ తీసుకోవచ్చు. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ సమ్మేళనాలతో పాటుగా ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. బీపీ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉల్లిపాయ రసంలో తేనె కలిపి తాగడం వల్ల వ్యాధనిరోధశక్తి పెరుగుతుంది. ఉల్లిపాయ రసంలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ అందిస్తాయి. ఉల్లిపాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఉల్లిపాయ రసంలోని క్రోమియం డయాబెటిస్ నుంచి రక్షణ అందిస్తుంది.
ఉల్లిపాయ రసంలో ఫైబర్‌తో పాటుగా ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఉల్లిపాయ రసం తాగితే మలబద్దకం, అజీర్తి తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగడాన్ని కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంట, వాపును కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.
ఉల్లిపాయ రసంలోని పోషకాలు దగ్గు, జలుబు, గొంతు నొప్పిని కంట్రోల్ చేస్తాయి. ఉల్లిపాయ రసం తాగితే శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలు తగ్గుతాయి. ఉల్లిపాయ రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లిపాయ రసం తాగితే ముడతలు తగ్గుతాయి. మచ్చల్లేని చర్మం పొందవచ్చు. ఉల్లిపాయ రసంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఉల్లిపాయ రసం రాసుకోవడం, తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..