Kitchen Hacks : గ్యాస్ స్టవ్‌పై జిడ్డు పేరుకుపోయి సరిగ్గా వెలగడంలేదా?అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్‌పై తరచుగా ఏదో ఒకటి పడిపోతుంది. అది బర్నర్ మీద అంటుకుంటుంది. దీంత గ్యాస్ స్టవ్ మురికిగా మారుతుంది

Kitchen Hacks : గ్యాస్ స్టవ్‌పై జిడ్డు పేరుకుపోయి సరిగ్గా వెలగడంలేదా?అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి
Kitchen Hacks

Edited By: Ravi Kiran

Updated on: May 30, 2023 | 9:45 AM

వంట చేసేటప్పుడు గ్యాస్ స్టవ్‌పై తరచుగా ఏదో ఒకటి పడిపోతుంది. అది బర్నర్ మీద అంటుకుంటుంది. దీంత గ్యాస్ స్టవ్ మురికిగా మారుతుంది. బర్నర్ పై మురికి పేరుకుపోయి మంట తక్కువగా వస్తుంది. బర్నర్ నుంచి జ్వాల తక్కువగా వస్తుండటంతో వంట చేయడం ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు లైటర్ తో లేదా అగ్గిపెట్టేతో గ్యాస్ స్టవ్ లో మంటను వెలిగించే ప్రయత్నం చేసినా…అది అంటుకోదు. ఇలాంటి సమస్య మీకు కూడా తలెత్తినట్లయితే…కొన్ని సులభమైన మార్గాల్లో గ్యాస్ స్టవ్ ను శుభ్రం చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ కాలిపోయినా..మురికిగా మారినా లేదంటే మంట తక్కువగా వచ్చే సమస్య ఉంటే..ఈ చిట్కాలతో సరిచేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

స్టవ్‎ను ఇలా శుభ్రం చేయండి:

మురికి లేదా కాలిన బర్నర్ కారణంగా గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి మీ గ్యాస్ స్టవ్, బర్నర్‌ను శుభ్రం చేయండి. దీన్ని శుభ్రం చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

శీతలపానీయం, పట్టిక పొడి:

గిన్నెలో కూల్ డ్రింక్ తీసుకుని అందులో రెండు చెంచాల పటిక పొడి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో గ్యాస్ స్టవ్ మీద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత బర్నర్‌ని బ్రష్‌తో శుభ్రం చేయాలి. ఇది కాలిన పొయ్యిని శుభ్రపరుస్తుంది. బర్నర్ సరిగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది.

పటిక, నిమ్మకాయ:

నిమ్మకాయ, పటికతో కూడా గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయవచ్చు. నిమ్మరసంలో పటికను కరిగించి మందపాటి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దాదాపు అరగంట పాటు గ్యాస్ స్టవ్ మీద అలాగే ఉంచండి. తర్వాత నిమ్మతొక్కతో స్టవ్‌ను రుద్ది శుభ్రం చేసుకోవాలి. అలాగే, మీరు బ్రష్‌తో బర్నర్‌లను శుభ్రం చేయవచ్చు. తర్వాత స్టవ్‌ను శుభ్రమైన నీటితో కడిగి, శుభ్రమైన, పొడి గుడ్డతో తుడవండి. గ్యాస్ పొయ్యిని శుభ్రపరచడం ద్వారా, బర్నర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.

గ్యాస్ స్టవ్ బర్నర్‌ను శుభ్రపరిచిన తర్వాత చిట్కాలు:

-గ్యాస్ స్టవ్‌ను శుభ్రం చేయడానికి ముందు, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా స్టవ్ సరిగ్గా పని చేస్తుంది.

-గ్యాస్ స్టవ్ బర్నర్‌ను శుభ్రపరిచే ముందు, గ్యాస్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయాలి, తద్వారా గ్యాస్ లీకేజ్ సమస్య ఉండదు.

-గ్యాస్ సరఫరాను ఆపివేసిన తరువాత, పైపును పొయ్యి నుండి తీసివేయాలి.

-శుభ్రపరిచిన వెంటనే గ్యాస్ స్టవ్ ఉపయోగించవద్దు. శుభ్రపరిచిన తర్వాత బర్నర్లు తడిగా ఉంటుంది కాబట్టి మంటను వెలిగించకూడదు.

-గ్యాస్ స్టవ్ పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే బర్నర్‌ను వెలిగించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..