ఓట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే.. రోజూ తింటారు..

ఓట్స్‌లో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఓట్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి, చర్మాన్ని సహజంగా మెరిపిస్తుంది. పొడిబారిన చర్మం, ఎరుపు దద్దుర్లు వంటి సమస్యలకూ ఓట్స్ ఉపశమనం కలిగిస్తాయి.

ఓట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే.. రోజూ తింటారు..
Oats

Updated on: Jul 19, 2025 | 8:36 PM

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఓట్స్‌ను తినడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గించుకోవడానికి ఓట్స్‌ ఎంతగానో సహాయపడతాయి. ఓట్స్ బీపీని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మంచి ఫలితం. ఓట్స్ లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, ఫోలేట్, విటమిన్ బి 1, విటమిన్ బి 5 వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి.

ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్లు కొలెస్ట్రాల్ స్థాయిలను, ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. హార్ట్ హెల్త్‌కి ఓట్స్ బెస్ట్ ఫుడ్‌ అంటున్నారు నిపుణులు. షుగర్ లెవల్స్‌కి బ్యాలెన్స్ ఇస్తుంది. శరీరానికి తక్షణ ఎనర్జీ అందిస్తుంది. అంతేకాదు, శరీరంతో పాటు చర్మానికి కూడా ఓట్స్ చాలా మంచిది. ఓట్స్‌తినటం డిటాక్సిఫికేషన్‌లో సహాయపడతాయి. రోజూ ఓట్స్ తీసుకుంటే ఫిట్‌గా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు.

డయాబెటిస్ ఉన్నవారికి, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఓట్స్‌ చాలా మంచిది. ఓట్స్‌లో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఓట్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించి, చర్మాన్ని సహజంగా మెరిపిస్తుంది. పొడిబారిన చర్మం, ఎరుపు దద్దుర్లు వంటి సమస్యలకూ ఓట్స్ ఉపశమనం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..