Pain Relief Wax: లేడీస్ ఇది మీకే.. ఇకపై వ్యాక్స్ చేసినా నొప్పి రానే రాదు..

|

Jun 08, 2024 | 4:26 PM

తమ బాడీపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు మహిళలు. ఇందుకు ఎక్కువగా వ్యాక్స్ ట్రై చేస్తారు. ఇది ఎంత నొప్పి పెడుతుందో చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది ఈ బాధను భరిస్తూ ఉంటారు. అందంగా కనిపించాలంటే ఈ నొప్పులు సాధారణమని మహిళలు అంటారు. అయితే అవాంఛిత రోమాలను తొలగించు కోవడానికి, నొప్పి లేకుండా ఉండేందుకు మార్కెట్లోకి ఎన్నో..

Pain Relief Wax: లేడీస్ ఇది మీకే.. ఇకపై వ్యాక్స్ చేసినా నొప్పి రానే రాదు..
Pain Relief Wax
Follow us on

తమ బాడీపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తూ ఉంటారు మహిళలు. ఇందుకు ఎక్కువగా వ్యాక్స్ ట్రై చేస్తారు. ఇది ఎంత నొప్పి పెడుతుందో చెప్పాల్సిన పని లేదు. ఎంతో మంది ఈ బాధను భరిస్తూ ఉంటారు. అందంగా కనిపించాలంటే ఈ నొప్పులు సాధారణమని మహిళలు అంటారు. అయితే అవాంఛిత రోమాలను తొలగించు కోవడానికి, నొప్పి లేకుండా ఉండేందుకు మార్కెట్లోకి ఎన్నో వచ్చాయి. కానీ వాటితో మరో చిక్కు. అవి వాడిన తర్వాత ట్యాన్ బాగా పెరిగిపోతుంది. ఆ ట్యాన్ వదిలించుకోవడం చాలా కష్టం. దీంతో నొప్పి ఉన్నా వ్యాక్స్ బెటర్ అని చాలా మంది ఇదే చేయించుకుంటారు. అయితే వ్యాక్స్ చేయించుకున్నా నొప్పి లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. నొప్పి రాదు. అవేంటా అని ఇంట్రెస్టింగ్‌గా ఉందా. చూసేయండి.

రేజర్ వద్దు..

అవాంఛిత వెంట్రుకలను తొలగించడానికి చాలా మంది రేజర్ కూడా ఉపయోగిస్తారు. రేజర్ వాడిన తర్వాత వాక్స్ చేస్తారు. వాక్స్ తర్వాత మళ్లీ వెంట్రుకలు పెరుగుతాయి. వీటిని తొలగించుకోవడానికి.. రేజర్ కూడా వాడతారు. ఈ విధంగా రేజర్ ఉపయోగిస్తే.. వాక్సింగ్ చేసే సమయంలో చాలా నొప్పిని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి రేజర్ ఉపయోగించకూడదు.

స్నానం చేయాలి:

వాక్స్ చేసిన తర్వాత నొప్పిని తగ్గించడంలో స్నానం కూడా ఒకటి. వాక్సింగ్ చేసిన తర్వాతే స్నానం చేస్తారు. కానీ వాక్స్ చేయించుకోవడానికి ముందు.. ఆ తర్వాత కూడా చేయాలి. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం ఇంకా మంచిది. దీంతో చర్మం శుభ్ర పడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకుంటాయి. నొప్పి కూడా తగ్గుతుంది. కాబట్టి వాక్స్ చేసిన తర్వాత వేడి నీళ్లతో స్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

స్క్రబ్ చేయండి:

వాక్స్ చేసిన తర్వాత నొప్పి రాకుండా ఉండాలంటే.. వాక్సింగ్ చేసే ముందు చర్మాన్ని స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా నొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు. స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. ఆ తర్వాత వాక్స్ చేసుకోవడం వల్ల నొప్పి అనేది తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..