
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చిన్న సమస్య రాగానే హాస్పిటళ్లకు పరుగులు తీయడం, వేలకు వేలు ఖర్చు చేసి మందులు వాడటం అలవాటైపోయింది. అయితే, మన శరీరానికి ఎలాంటి ఖర్చు లేకుండా, పైసా మందులు లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే 8 మంది ఉత్తమ వైద్యులు మన చుట్టూనే ఉన్నారని మీకు తెలుసా? అవును.. మనల్ని నిరంతరం ఆరోగ్యంగా ఉంచే ఆ టాప్ 8 బెస్ట్ డాక్టర్లు ఎవరో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి..? ఆరోగ్య నిపుణులు వాటిని ఎందుకు సజెస్ట్ చేస్తారు..? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
1. వాటర్..
మన శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణక్రియ మెరుగవ్వడమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది.
2. ఫాస్టింగ్..
లంఖణం పరమౌషధం అంటారు పెద్దలు. వారానికి ఒకసారి లేదా నెలకు రెండు సార్లు ఉపవాసం చేయడం వల్ల జీర్ణవ్యవస్థకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించి, మెటబాలిజాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
3. రెస్ట్.. నిద్ర
శరీరానికి, మనస్సుకు రీఛార్జ్ లాంటిది నిద్ర, విశ్రాంతి. ప్రతిరోజూ 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. సరైన విశ్రాంతి దొరికినప్పుడే మరుసటి రోజుకు శరీరం పూర్తి శక్తితో సిద్ధమవుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది.
4. యోగా..
యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. అది శరీరాన్ని, మనస్సును అనుసంధానించే ప్రక్రియ. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరగడమే కాకుండా, అంతర్గత అవయవాల పనితీరు మెరుగవుతుంది.
5. మెడిటేషన్..
ఆందోళన, ఒత్తిడి, మానసిక అలసటను దూరం చేసే బెస్ట్ డాక్టర్ ధ్యానం. రోజుకు కనీసం 15-20 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
6. నేచర్..
కృత్రిమ వాతావరణానికి, స్క్రీన్లకు కాస్త దూరంగా జరిగి ప్రకృతి ఒడిలో గడపడం అలవాటు చేసుకోండి. చెట్ల మధ్య నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. నెగెటివ్ ఆలోచనలు దూరమవుతాయి.
7. హెల్తీ ఫుడ్స్..
మనం తినే ఆహారమే మనకు మొదటి మందు.జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటూ.. ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలను మన డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
8. ఎక్సర్‌సైజ్..
శరీరానికి శ్రమ లేకపోతే రోగాలు త్వరగా దాడి చేస్తాయి. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, రన్నింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది.
హాస్పిటల్స్, ఖరీదైన మందుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదంటే.. ఈ 8 మంది సహజ వైద్యుల ను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. చిన్న చిన్న మార్పులతోనే కొండంత ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు.. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
గమనిక: ఉపవాసం, నీటి పరిమాణం, వ్యాయామం వంటి అంశాలు వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మారవచ్చు. మధుమేహం, గుండె జబ్బులు, గర్భధారణ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..