Neck Pain Tips: ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల మెడ నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

| Edited By: Anil kumar poka

Dec 19, 2022 | 1:47 PM

ఎక్కువ సేపు కూర్చొనే పని చేయడం వల్ల మనం వివిధ సమస్యలకు గురవుతాం. అలాగే అదే పనిగా ఫోన్ వాడడం కూడా సమస్యలను పెంచవచ్చు.

Neck Pain Tips: ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల మెడ నొప్పి వేధిస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
Neck Pain
Follow us on

ప్రస్తుత సమాజంలో ఫోన్ వాడకం అనేది నిత్యకృత్యమైంది. అలాగే కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయడం తప్పనిసరైంది. ఎక్కువ సేపు కూర్చొనే పని చేయడం వల్ల మనం వివిధ సమస్యలకు గురవుతాం. అలాగే అదే పనిగా ఫోన్ వాడడం కూడా సమస్యలను పెంచవచ్చు. అయితే అందులో కొన్ని ఇబ్బందులు మనకు ఎదురవడానికి కొంచెం టైమ్ పట్టొచ్చు కానీ మెడ నొప్పి, వెన్నునొప్పి వంటివి మనల్ని వెంటనే ఇబ్బంది పెడతాయి. అయితే మెడ నొప్పి నుంచి సింపుల్ చిట్కాల ద్వారా మనం  బయటపడవచ్చు. 

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు ఉద్యోగం అంటే సాధారణంగా మనం ఒకే పొజిషన్ కూర్చొని గంటల తరబడి పని చేయాల్సి వస్తుంది. కానీ ఆ పోజిషన్ కరెక్ట్ గా లేకపోయినా మనం పట్టించకోము. దీంతో మెడ నొప్పి రావడానికి అవకాశం ఉంది. సెర్వికల్ స్పెయిన్ వద్ద ఉండే మృధువైన నరాలపై ఒత్తిడి పడడంతో తీవ్రమైన మెడనొప్పితో బాధపడవచ్చు. మెడనొప్పి నుంచి బయటపడేందుకు నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  1.  పని ఒత్తిడి వల్ల ఒకే పొజిషన్ లో కూర్చొని పని చేయడం మెడ నొప్పికి ప్రధాన కారణమవుతుంది. కాబట్టి పని చేసే సమయమంలో ప్రతి అరగంటకు ఓ సారి  విరామం తీసుకుంటే మెడ నొప్పి నుంచి బయటపడవచ్చు. 
  2.  భుజాలపై అధిక బరువులను మోయకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలు చేస్తుంది.
  3.  అలాగే తల ఎదురుగా చేతిని పెట్టి మెడను తిప్పడానికి కొంచెం ఒత్తిడిని కలిగించడం ద్వారా కూడా మెడనొప్పి తీవ్రతను తగ్గిస్తుంది. దీన్న నెక్ స్ట్రెచ్ అంటారు. 
  4.  మనల్ని మనం కౌగలించకోవడం అంటే మీ కుడి చేతిని మీ ఎడమ భుజంపై ఉంచి, మీ ఎడమ చేతిని మీ కుడి భుజంపై ఉంచి శ్వాస తీసుకోవాలి. ఇలా చేస్తే భుజం మీ వెనుకభాగంలో ఒత్తిడిని వదిలించుకోవడానికి ఉపయోగపడుతుంది. 
  5.  పడుకునే సమయంలో దిండు ఉపయోగించడం మానుకుంటే మంచిది. దిండు వాడకపోతే మెడపై ఒత్తిడి తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయం.
  6.  తలను కొంచెం ముందుకు వంచి స్లో గా తలని పేకెత్తి పైన చూడాలి అలా ఐదు సెకన్ల పాటు ఉంచాలి. ఈ ట్రిక్ ద్వారా కూడా మనకు మెడ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
  7.  అలాగే ధూమపానం నుంచి వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ కారణం వల్ల మెడ నొప్పి పెరిగే అవకాశం ఉంది. అలాగే మన జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..