Cancer: స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య.. ఎలాగో తెలుసా?

|

Nov 23, 2024 | 10:23 AM

క్యాన్సర్‌ వచ్చిందంటే అంత సులభంగా బయటపడడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా స్టేజ్‌ 4 క్యాన్సర్‌ను జయించడం అంత ఈజీ కాదు. అయితే మాజీ క్రికెటర్‌, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ సిద్ధూ క్యాన్సర్‌ను జయించారు. సహజ విధానాలను పాటిస్తూనే ఆమె క్యాన్సర్‌ను తరిమికొట్టారు..

Cancer: స్టేజ్ 4 క్యాన్సర్‌ని ఓడించిన నవజ్యోత్ సిద్ధూ భార్య.. ఎలాగో తెలుసా?
Navjot Singh Sidhu
Follow us on

క్యాన్సర్‌ మహమ్మారి ఒక్కసారి వస్తే కోలుకోవడం అంత సులభం కాదు. ప్రాణాలను బలితీసుకునే ఈ మయదారి రోగంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్‌ 4వ స్టేజ్‌ నుంచి బయటపడడం అంత సులభమైన విషయం కాదు. అయితే తాజాగా మాజీ క్రికెటర్‌, రాజకీయ నేత నవజ్యోత్‌ సింగ్ సిద్దూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్దూ స్టేజ్‌4 క్యాన్సర్‌ను జయించారు.

వైద్యులు బతికే అవకాశం కేవలం 3 శాతం మాత్రమే ఉందని చెప్పిన నేపథ్యంలో ఆమె క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించారు. ఈ విషయాన్ని నవజ్యోత్‌ సిద్ధూ మీడియాతో పంచుకున్నారు. తన భార్య క్యాన్సర్‌లో ఎలా జయించారన్న విషయాన్ని వివరించారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ సిద్ధూ భార్య క్యాన్సర్‌ను ఎలా జయించారు.? ఇందుకోసం ఆమె ఎలాంటి డైట్‌ను ఫాలో అయ్యారు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘మా అబ్బాయి పెళ్లి తర్వాత భార్యకు క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఆమె బతుకుతుందా..?లేదా..? అనే అనుమానం మాలో ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. క్యాన్సర్‌ని ధైర్యంగా ఎదుర్కొంది’ అని చెప్పుకొచ్చారు. పాటియాలోని రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్‌కు చికిత్స అందించారని తెలిపారు. ఆమె క్యాన్సర్‌ను డబ్బు ఓడించలేదని.. ఆమె క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ క్యాన్సర్‌ను జయించిందని తెలిపారు. సరైన విధానాలు పాటిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా క్యాన్సర్‌కు చికిత్స అందించవచ్చని తెలిపారు.

నిమ్మరసం, పసుపు, యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, వేప ఆకులు, తులసి ఆకులు ఆహారంలో భాగం చేసుకున్నారని సిద్ధూ తెలిపారు. తీసుకునే ఆహారంలో గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్‌రూట్, వాల్‌నట్‌ వంటి చేర్చుకున్నారని తెలిపారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు , బెల్లం, యాలకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. చూశారుగా ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో క్యాన్సర్‌ను ఎలా జయించవచ్చో చెప్పేందుకు ఈ సంఘటన బెస్ట్‌ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..