సన్ టాన్ పోయి స్కిన్ ఫెయిర్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! కాస్ట్లీ క్రీమ్స్ అవసరం లేదు..!

|

Mar 14, 2025 | 5:42 PM

ఎండలో ఎక్కువ సమయం గడిపితే చర్మం నల్లగా మారుతుంది. దీని వల్ల చర్మం కాంతివిలీనమై మురికగా మారుతుంది. అయితే ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్ వాడకుండానే ఇంట్లోనే సహజమైన పదార్థాలతో ట్యాన్ తగ్గించుకోవచ్చు. టమాటో, బంగాళాదుంప, పెరుగు, అలోవెరా వంటి పదార్థాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటి ఉపయోగంతో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ట్యాన్ తగ్గించుకోవచ్చు.

సన్ టాన్ పోయి స్కిన్ ఫెయిర్ అవ్వాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..! కాస్ట్లీ క్రీమ్స్ అవసరం లేదు..!
Natural Skincare
Follow us on

ఎండల్లో ఎక్కువ సమయం గడిపితే స్కిన్ నల్లగా మారడం ట్యాన్ ఏర్పడడం సహజమే. అయితే దీన్ని తగ్గించేందుకు ఖరీదైన క్రీమ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను సమర్థంగా నివారించుకోవచ్చు. చర్మాన్ని తెల్లగా మార్చడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా ఈ ఇంటి చిట్కాలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కీర దోసకాయ

కీర దోసకాయలో సహజమైన కూలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇది ఎండ వల్ల కలిగిన ట్యాన్, కమిలిన చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తాజా కీర దోసకాయ రసాన్ని తీసుకుని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా మారుతుంది.

అలోవెరా

అలోవెరాలో చర్మాన్ని ప్రశాంతంగా ఉంచే గుణాలు ఉంటాయి. దీనిని ముఖానికి ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

తేనె, నిమ్మరసం

తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉండడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నిమ్మరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేసి స్కిన్‌ని ప్రకాశవంతంగా మారుస్తుంది. కొద్దిగా తేనెలో నిమ్మరసం కలిపి ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 20 నిమిషాల తరువాత కడిగేయాలి.

పెరుగు

పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది చర్మాన్ని మృదువుగా చేసి ట్యాన్ తగ్గిస్తుంది. దీని కోసం అర టీస్పూన్ పసుపులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

టమాటో

టమాటోలో ఉన్న లైకోపీన్ చర్మాన్ని రక్షించడంతో పాటు పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్కిన్‌పై ఏర్పడిన నల్లటి మచ్చలను ట్యాన్‌ను దూరం చేస్తుంది. దీని కోసం తాజా టమాటాను మెత్తగా నూరి ముఖానికి లేదా ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

బంగాళాదుంప

పచ్చి బంగాళాదుంప చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చే గుణాలను కలిగి ఉంటుంది. దీని జ్యూస్‌ను స్కిన్‌పై రాసి అరగంట పాటు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ట్యాన్ తగ్గిపోతుంది. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్ త్వరగా తగ్గి చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.