Switchboard Cleaning Hacks: స్విచ్ బోర్డులు నల్లగా ఉన్నాయా.. ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తున్నారా..?

ఇంట్లోని స్విచ్ బోర్డులు రోజురోజుకూ దుమ్ము, మురికితో నల్లబడిపోతుంటాయి. అవి చూడటానికి అస్సలు బాగోకపోవడం వల్ల మొత్తం గదికి బ్యాడ్ లుక్ వస్తుంది. అయితే మార్కెట్లో దొరికే రసాయనాలు కాకుండా.. ఇంట్లోనే అందుబాటులో ఉండే సహజ పదార్థాలతో స్విచ్ బోర్డులను చక్కగా, తెల్లగా మెరిపించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Switchboard Cleaning Hacks: స్విచ్ బోర్డులు నల్లగా ఉన్నాయా.. ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తున్నారా..?
Diy Cleaning Tips

Updated on: Jun 01, 2025 | 2:01 PM

షేవింగ్ క్రీమ్ కేవలం మగవారికి మాత్రమే కాదు.. ఇది చాలా మంచి క్లీనింగ్ ఏజెంట్‌ గా కూడా పని చేస్తుంది. స్విచ్ బోర్డు పై కొద్దిగా షేవింగ్ క్రీమ్ తీసుకుని అప్లై చేసి రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌ తో మెల్లగా రుద్ది ఒక మృదువైన బట్టతో తుడిచేస్తే బోర్డు కొత్తగా మెరిసేలా మారిపోతుంది.

నిమ్మరసంలో సహజంగా సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల మురికి తేలికగా కరిగిపోతుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని స్విచ్ బోర్డుపై అప్లై చేయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత ఒక మృదువైన బట్టతో తుడిచేస్తే మురికి పూర్తిగా పోతుంది. ఇది సహజమైన, సురక్షితమైన మార్గం.

నెయిల్ పాలిష్ తొలగించడానికి ఉపయోగించే రిమూవర్‌ లో ఉండే రసాయనాలు స్విచ్ బోర్డు మీద ఉన్న జిడ్డు, మరకలను కొంతమేర తొలగించగలవు. ఒక బట్టలో కొద్దిగా రిమూవర్ తీసుకుని స్విచ్ బోర్డును తుడవాలి. అవసరమైతే రెండోసారి కూడా ఇలా చేయొచ్చు. ఇలా చేస్తే మురికి పూర్తిగా పోతుంది.

ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ ను స్విచ్ బోర్డు మీద అప్లై చేసి బ్రష్ లేదా బట్టతో నెమ్మదిగా రుద్దాలి. మురికి తొలగిపోవడంతో పాటు మంచి షైనింగ్ కూడా వస్తుంది.

టాయిలెట్ క్లీనర్‌ లు ఎక్కువ శాతం శుభ్రపరచే రసాయనాలతో తయారవుతాయి. చిన్నగా స్విచ్ బోర్డు మీద వేసి పది నిమిషాలు వదిలేసి మృదువైన బట్టతో తుడిచిపెడితే బోర్డు కొత్తదానిలా మెరుస్తుంది. కానీ ఇది కొంచెం శక్తివంతమైన క్లీనర్ కాబట్టి జాగ్రత్తగా వాడాలి. గ్లోవ్స్ ధరించడం మంచిది.

బ్లీచింగ్ పౌడర్ మురికి శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రెండు స్పూన్ల బ్లీచింగ్ పౌడర్‌ లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్‌ లా చేసుకుని.. దాన్ని స్విచ్ బోర్డుపై రాయాలి. కొద్దిసేపటి తర్వాత బట్టతో తుడిచేస్తే మురికి పూర్తిగా తొలగిపోతుంది.

బేకింగ్ సోడాలో కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ కలిపి తక్కువ నీటితో పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ ను స్విచ్ బోర్డు మీద అప్లై చేసి మెల్లగా రుద్దాలి. ఇది చాలా తక్కువ సమయంలో ఫలితం ఇస్తుంది. మెరిసే తెల్లదనాన్ని తిరిగి పొందవచ్చు.

చిటికెడు నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి ఒక మృదువైన బట్టను అందులో ముంచి స్విచ్ బోర్డు మీద తుడవాలి. ఇది సాధారణ మురికి, దుమ్మును తొలగించడంలో సహాయపడుతుంది. ఇలా ప్రతివారం ఒకసారి చేస్తే.. బోర్డు ఎప్పుడూ శుభ్రంగా మెరిసిపోతుంది.

ఇంట్లో ఉండే సహజ పదార్థాలతోనే చక్కటి ఫలితాలు పొందవచ్చు. ఇక మీదట మీ ఇంట్లోని స్విచ్ బోర్డులు ఎప్పుడూ కొత్తగా మెరిసేలా ఉంచండి. దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి.. మీరు ఈ చిట్కాలను ఫాలో అయ్యేటప్పుడు తప్పకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి.