అది ఇది వద్దు.. మటన్‌లోని ఈ పార్ట్‌ను ఇలా వండారంటే.. ఇక ఆ రోగాలకు దబిడి దిబిడే..

కీళ్ల నొప్పుల నివారణకు మటన్ బోన్స్ సూప్ ఒక అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు.. రుచికరమైన, ఆరోగ్యకరమైన మటన్ పాయా సూప్ ను ఏ కాలంలోనైనా.. ఎప్పుడైనా తీసుకోవచ్చు.. కొల్లాజెన్ సమృద్ధిగా ఉండే ఈ బోన్ బ్రోత్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ సాంప్రదాయ వంటకం మీకు రెస్టారెంట్ రుచిని అందిస్తుంది.

అది ఇది వద్దు.. మటన్‌లోని ఈ పార్ట్‌ను ఇలా వండారంటే.. ఇక ఆ రోగాలకు దబిడి దిబిడే..
మటన్‌లో ప్రతి పార్ట్ రుచి కరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Updated on: Apr 05, 2026 | 11:09 AM

మటన్ పాయ (మేక కాళ్ళ సూప్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు సహా.. అన్ని ప్రాంతాల్లో మటన్ బోన్స్ సూప్ ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన ఔషధంగా ప్రాచుర్యం పొందింది. ఇది ఎముకలను బలంగా మార్చడం నుంచి కీళ్ల నొప్పులను తగ్గించడం వరకు ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మటన్ పాయాలో ప్రోటీన్, కాల్షియం, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీనిలోని కొల్లాజెన్ ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ సూప్, అనారోగ్యం తర్వాత శారీరక శక్తిని పునరుద్ధరించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుందని డైటీషియన్లు పేర్కొంటున్నారు. అందుకే.. దీనిని సూపర్‌ఫుడ్ గా పేర్కొంటారు.

ఈ ప్రత్యేక వంటకం పాయా సూప్, రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మటన్ కాళ్ల సూప్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..

ఇంట్లో రెస్టారెంట్-శైలి పాయా సూప్ తయారు చేయడానికి సులభమైన పద్ధతి..

ముందుగా, ఒక ప్రెషర్ కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత, ఒక టీస్పూన్ జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు వంటి మొత్తం మసాలా దినుసులను వేసి వేయించాలి. సువాసన రాగానే, సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి, లేత బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి.

ఈ సమయంలో, నాలుగు మేక కాళ్ళను (పాయా) సిద్ధం చేసుకోవాలి. పాయాను శుభ్రం చేయడానికి గోధుమపిండి, కొద్దిగా ఉప్పు కలిపి రుద్దడం వల్ల అవి పూర్తిగా శుభ్రపడతాయి. లేకపోతే ఉప్పుతోనైనా శుభ్రం చేసుకోవచ్చు.. శుభ్రం చేసిన పాయాను కుక్కర్‌లో వేసి, మూడు నుండి నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఆ తర్వాత, ఒక టీస్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ మిరియాల పొడిని చేర్చాలి. ఈ మసాలాలన్నీ పాయాకు బాగా పట్టేలా రెండు నుండి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలా చూసుకోవాలి. పాయా రంగు మారడం గమనించవచ్చు.

ఇప్పుడు, సూప్ కోసం రెండు గ్లాసుల నీళ్లు పోసి, మసాలాలు బాగా కలిసేలా ఒకసారి కలుపాలి. కుక్కర్ మూత పెట్టి, హై ఫ్లేమ్‌లో రెండు విజిల్స్, ఆపై లో ఫ్లేమ్‌లో ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి. దీనివల్ల పాయా బాగా మెత్తగా ఉడుకుతుంది. మొత్తం ఏడు నుండి ఎనిమిది విజిల్స్ తర్వాత, స్టవ్ ఆపి, ప్రెషర్ పూర్తిగా తగ్గే వరకు వేచి ఉండాలి. ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీయాలి.

చివరగా, వేడివేడి పాయా సూప్‌ను ఒక గిన్నెలోకి తీసుకుని, పైన కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ సూప్‌ను నేరుగా తాగవచ్చు లేదా పరాటాతో కూడా ఆస్వాదించవచ్చు. ఇది ఆరోగ్యకరమైనది, రుచికరమైనది.. ఇది ఎప్పుడైనా ఈ సీజన్ లోనైనా తప్పకుండా ప్రయత్నించవలసిన వంటకం. ఈ పద్ధతిలో తయారుచేసిన పాయా సూప్ మీకు గొప్ప రుచిని అందిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us