ఆత్మహత్యకు సోమవారంతో సంబంధం ఏమిటి? ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తారంటే?

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణం. చిన్నవారైనా, పెద్దవారైనా ప్రతి ఒక్కరి మానసిక ఆరోగ్యం ఏదో ఒక కారణాల వల్ల క్షీణిస్తోంది. దీని కారణంగా ప్రజలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బీఎంజే మెడికల్ జర్నల్‌లోని పరిశోధన ప్రకారం సోమవారం చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆత్మహత్యకు సోమవారంతో సంబంధం ఏమిటి? ఈ రోజున ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ఆలోచిస్తారంటే?
Suicide Risk
Image Credit source: Adobe Stock/HealthDay News

Updated on: Oct 29, 2024 | 9:56 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2019 సంవత్సరానికి సంబంధించిన ఒక డేటాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అందులో పేర్కొంది. ఇలా ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో భారీ సంఖ్యలో యువత కూడా ఉన్నారు. డిప్రెషన్ (మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం) ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఒక వ్యక్తి తన జీవితంలో ఏమీ మిగలదని అనుకోవడం ప్రారంభించినప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడు. డిప్రెషన్ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు తలెత్తుతాయి. వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య ఆలోచనలు ఎప్పుడైనా రావచ్చని సాధారణంగా నమ్ముతారు. అయితే మానసిక ఆరోగ్యం, ఆలోచనలపై ఇప్పుడు ఒక పరిశోధన జరిగింది. అందులో సోమవారం ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబడింది. BMJ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలో ఈ వాదన జరిగింది.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా జరిగిన ఆత్మహత్యల ప్రపంచ విశ్లేషణ ప్రకారం వారంలోని ఇతర రోజుల కంటే సోమవారం రోజునే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. మెడికల్ జర్నల్ BMJలో ప్రచురించబడిన ఈ పరిశోధనలో 1971 నుంచి 2019 మధ్య 26 దేశాలలో 1.7 మిలియన్ల ఆత్మహత్యలపై విశ్లేషించింది.

ఈ పరిశోధనలో అమెరికన్, ఆసియా, ఐరోపా దేశాలలో జరిగిన ఆత్మహత్యల డేటాను ఐరోపా దేశాలైన చెక్ రిపబ్లిక్, ఎస్టోనియా, ఫిన్‌లాండ్, జర్మనీ, ఇటలీ, రొమేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ అధ్యయనంలో చేర్చారు. ఈ దేశాల్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు.. ప్రాణత్యాగం చేయాలనే ఆలోచన సోమవారం ఎక్కువగా ఉంటాయనే.. వాదన తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

సోమవారం ఆత్మహత్య ప్రమాదం ఎందుకు ఎక్కువ?

UKలోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో సోషల్ సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా ఓషీయా మాట్లాడుతూ.. సోమవారం ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలో స్పష్టంగా తెలియలేదని.. అయితే సోమవారం పని ఒత్తిడి, సెలవుల తర్వాత తిరిగి పని చేయడం వంటి కారణాలు సెలవు దినం తర్వాత ఆత్మహత్య ఆలోచనలకు కారణం కావచ్చని చెప్పారు.

ప్రొఫెసర్ బ్రియాన్ ఓషీయా మాట్లాడుతూ.. శుక్రవారం ప్రజలు మంచి మూడ్‌లో ఉంటారని.. వారాంతం కోసం ఎదురుచూస్తారని శని, ఆదివారాలు సెలవులు కనుక కుటుంబ సభ్యులను కలుస్తారని సంతోషంగా గడుపుతారని.. అయితే సోమవారం పని ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారని చెప్పారు. ఇది ఆత్మహత్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ప్రొఫెసర్ బ్రియాన్ ఆత్మహత్య ఆలోచనలు కొన్ని కారణాల వల్ల మానసిక ఆరోగ్యం ఇప్పటికే చెడుగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు చేసి వివిధ దేశాల సామాజిక సాంస్కృతిక అంశాలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరణానికి నాల్గవ ప్రధాన కారణం ఆత్మహత్య

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియా, హెచ్ఐవి/ఎయిడ్స్, రొమ్ము క్యాన్సర్ కంటే ఆత్మహత్యలే ఎక్కువ మరణాలకు కారణమవుతాయి. ఇది మరణాలకు నాల్గవ ప్రధాన కారణం. ముఖ్యంగా 15-29 సంవత్సరాల వయస్సు గల యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన అందరికీ రాదని సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎకె కుమార్ చెబుతున్నారు. మెదడులోని బయో-న్యూరోలాజికల్ మార్పుల వల్ల ఇది జరుగుతుంది. ఈ మార్పు కారణంగా వ్యక్తి తన జీవితం ఇకపై ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 95 శాతం మంది ఏదో ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఈ వ్యాధి ప్రబలంగా మారి మెదడు పనితీరును ప్రభావితం చేయడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..