Mosquito Bites: దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే

దోమ కుట్టిన వెంటనే ఆ ప్రదేశం ఎర్రగా కందిపోవడం, తీవ్రమైన దురద రావడం మనందరికీ అనుభవమే. అయితే, ఈ దురదకు కారణం దోమ మన చర్మాన్ని గుచ్చడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు కారణం అది కాదట! మన రోగనిరోధక వ్యవస్థ ఒక అపరిచిత పదార్థంపై జరిపే దాడి వల్లనే ఈ సమస్య వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దోమ కాటు వెనుక ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం..

Mosquito Bites: దోమ కరిచిన చోట దద్దుర్లు, దురద వస్తున్నాయా?. దీని వెనుక అసలు సీక్రెట్ ఇదే
Why Mosquito Bites Itch

Updated on: Mar 27, 2026 | 6:48 PM

దోమలు రక్తాన్ని పీల్చడానికి ముందు మన సిరల్లోకి తమ లాలాజలాన్ని ఎందుకు ఎక్కిస్తాయి? రక్తం గడ్డకట్టకుండా దోమ చేసే ఆ ‘కెమికల్ లోచా’ ఏంటి? మన శరీరంలో విడుదలయ్యే ‘హిస్టమైన్’ అనే రసాయనం దురదను ఎలా కలిగిస్తుంది? డెంగ్యూ, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? తెలుసుకుందాం..

లాలాజలం విడుదల: దోమ మన రక్తాన్ని పీల్చే ముందు తన లాలాజలాన్ని చర్మంలోకి పంపిస్తుంది. ఇందులో రక్తం గడ్డకట్టకుండా నిరోధించే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి. దీనివల్ల దోమ రక్తాన్ని చాలా సులభంగా, వేగంగా పీల్చగలుగుతుంది.

శరీర ప్రతిచర్య (Immune Response): దోమ పంపిన లాలాజలాన్ని మన శరీరం ఒక ‘శత్రువు’ గా గుర్తిస్తుంది. దానిని తొలగించడానికి మన రోగనిరోధక వ్యవస్థ వెంటనే ‘హిస్టమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.

దురద, వాపు: హిస్టమైన్ విడుదలైనప్పుడు ఆ ప్రాంతంలో రక్తనాళాలు విస్తరిస్తాయి. దీనివల్ల అక్కడ ఎర్రటి దద్దుర్లు, వాపు విపరీతమైన దురద వస్తాయి.

దురద నుండి ఉపశమనం పొందడం ఎలా?                                                                                                                                                                          శుభ్రత: దోమ కుట్టిన చోట మొదట సబ్బు, నీటితో కడగాలి.

ఐస్ ప్యాక్: కాటు వేసిన చోట ఐస్ పెడితే రక్తనాళాలు సంకోచించి, వాపు దురద తగ్గుతాయి.

లోషన్లు: క్యాలమైన్ లోషన్ లేదా అలోవెరా జెల్ రాయడం వల్ల చర్మం చల్లబడి ఉపశమనం కలుగుతుంది.

దోమకాటు కేవలం దురదనే కాదు, తీవ్రమైన వ్యాధులను కూడా మోసుకొస్తుంది. కాబట్టి కిటికీలు మూసి ఉంచడం, దోమల వలలు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

దోమ కుట్టిన చోట గోళ్లతో గీరవద్దు. అలా చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి గాయం పెద్దదయ్యే ప్రమాదం ఉంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. తీవ్రమైన జ్వరం లేదా ఒంటి నొప్పులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Follow Us