Lifestyle: మార్నింగ్‌ వాక్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే మీకే నష్టం!

ప్రతిరోజూ మార్నింగ్‌ వాక్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అందరికీ తెలుసు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది వీలు చేసుకొని మరి మార్నింగ్‌ వాక్స్‌కు వెళ్తున్నారు. కానీ వాక్‌ చేసేటప్పుడు మీరు చేసే కొన్ని తప్పుల కారణంగా మీరు ఎలాంటి ప్రయోజనాలను పొందలేరు. పైగా సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఆ తప్పులు ఏంటో తెలుసుకొని.. వాటిని ఎలా నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం.

Lifestyle: మార్నింగ్‌ వాక్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. లేదంటే మీకే నష్టం!
Morning Walk

Updated on: Aug 28, 2025 | 6:30 AM

నడక అనేది మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండే ఒక సాధారణ వ్యాయామం. ఇది బరువు తగ్గడం, మానసిక స్థితి మెరుగుదల, గుండె ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడు సమయంలో వాక్‌ చేయడం మనసుకు ఎంతో హాయిని ఇస్తుంది. అయితే కొందరు మార్నింగ్‌ వాక్‌ సమయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పుల మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఆ తప్పుడు ఏంటని విషయానికి వస్తే..

మార్నింగ్‌ వాక్‌లో మీరు చేయకూడని తప్పులు ఇవే!

  • నీరు తాగకపోవడం: మీరు మార్నింగ్‌ వాక్‌ వెళ్లేటప్పుడు నీరు త్రాగకుండా వెళ్లడం చేయకండి. ఈ పొరపాటు వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది, నిర్జలీకరణానికి దారితీస్తుంది. కాబట్టి, నడకకు వెళ్లే 15 నుండి 20 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం మంచింది.
  • ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నడవడం: ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, దీనివల్ల తలతిరుగుడు, అలసట లేదా తలనొప్పి వస్తుంది. కాబట్టి, మీరు ఉదయం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నడవబోతున్నట్లయితే, నడవడానికి ముందు అరటిపండు, నానబెట్టిన వేరుశెనగలు లేదా కొన్ని ఎండిన పండ్లు వంటి ఆరోగ్యకరమైన చిరుతిండిని తినండి.
  • వేడెక్కకుండా నడవడం: ఉదయం మన బాడీ వేడెక్కకుండా నడవడం వల్ల కండరాలు మరియు కీళ్లపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల, నడవడానికి ముందు రెండు నుండి ఐదు నిమిషాలు మీ శరీరం వేడెక్కేలా కాస్తా వ్యాయామం చేయండి..
  • ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం: కొంతమంది శరీరానికి శక్తినివ్వడానికి నడకకు వెళ్లే ముందు ఒక కప్పు కాఫీ తాగుతారు. కానీ ఇది మంచిది కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట మాత్రమే కాకుండా, నరాలపై ఒత్తిడి కూడా వస్తుంది. కాబట్టి, తేలికపాటి అల్పాహారం తీసుకోండి. కావాలంటే తిరిగొచ్చాక కాఫీ తాగండి.
  • టాయిలెట్‌కి వెళ్ళకపోవడం: బయట నడవడానికి వెళ్ళే ముందు వాష్ రూమ్ కి వెళ్ళకుండా ఉండటం ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపు సంబంధిత సమస్యలు మరియు UTI (మూత్ర నాళాల ఇన్ఫెక్షన్) వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, వాకింగ్ కి వెళ్ళే ముందు, ఖచ్చితంగా వాష్ రూమ్ కి వెళ్ళండి, తద్వారా మీరు పూర్తి మనశ్శాంతితో నడవగలరు.

మరిన్ని లైఫ్‌స్లైట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.