సాధారణంగా మనం కూరల్లో మునక్కాయ కూర వండుకుంటాం. అయితే కొంత మంది మునగాకుతో కొన్ని రకాల కూరలు వండుకుంటారు. కానీ ప్రస్తుతం మునగాకుతో కూరలు చేయడానికి ఎవరూ ఇష్టపడడం లేదు. అయితే మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగాకులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో పాటు, విటమిన్ సి, విటమిన్ ఎ, ఖనిజాలు వంటి అన్ని పోషకాలు ఉంటాయి. మునగ ఆకుల్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ మాలిక్యూల్ పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. మునగాకులు జీర్ణక్రియకు మంచివి. అవి నిద్రను మెరుగుపరుస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తాయి. యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉండడంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో తాజా మునగాకు దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆకులు దొరకినప్పుడే వివిధ మార్గాల్లో వంటలు చేసుకుని తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పోషకాహార నిపుణులు మునగాకు తినే మంచి మార్గాలను చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.
మునగాకుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అధిక క్యాలరీల ఆహారానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. మునగాకు టీ చేయడం చాలా సులభం. నీళ్లను మరిగించి అందుల్లో కొన్ని మునగాకులు వేసుకుని, అనంతరం వాటిని వడకట్టాలి. తర్వాత అందుల్లో తేనె వేసుకుని తాగాలి.
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల పొడులను చేస్తారు. ఇదే పద్ధతిలో మునగాకు పొడిని కూడా చేసుకోవచ్చు. సాధారణంగా కరివేపాకు పొడి చేసుకున్న మాదిరిగానే మునగాకు పొడిని చేసుకోవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైన ఎంపికని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..