Foot care in monsoon: ఇతర సీజన్లతో పోల్చితే వర్షాకాలంలో ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. ఇక వర్షాకాలంలో కాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో మురికినీటితో ఎక్కువగా కాంటాక్ట్ అయ్యేది కాళ్లే. ఫలితంగా మురికి నీటి కారణంగా కాళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే వర్షాకాలంలో పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి ఇందుకోసం కొన్ని సింపుల్ టిప్స్ తెలుసుకుందాం రండి.
ఉప్పుతో
చర్మ సమస్యలను తొలగించడంలో ఉప్పు ఉత్తమంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మీరు ఉప్పుతో ఫంగస్ రూపంలో చర్మంపై కూర్చున్న మురికి బ్యాక్టీరియాను సులభంగా తొలగించవచ్చు. దీని కోసం, స్నానం చేసే ముందు, నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల ఉప్పు వేసి, పాదాలను సుమారు 15 నిమిషాలు అందులో ఉంచండి. ఫలితంగా కాలి వేళ్ల మధ్య ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్ కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది.
ఇలా నడవొద్దు..
వర్షాకాలంలో పాదాలు తరచుగా తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు బాగా ఇబ్బంది పెడతాయి. వీటి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షపు నీటిలో చెప్పులు లేకుండా అసలు నడవద్దు. మురికి నీటిలో చెప్పులు లేకుండా నడవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. కావాలంటే బూట్లు ధరించే ముందు యాంటీ ఫంగల్ పౌడర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇది ఇన్ఫెక్షన్ నుండి పాదాలను కాపాడుతుంది. అలాగే కాళ్లను మృదువుగా ఉంచుతుంది.
వంట సోడా
ఉప్పుతో పాటు, బేకింగ్ సోడా కూడా ఫంగల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. ఇందుకోసం ఓ హోం రెమెడీని అవలంబిస్తే చాలు. ఇందుకోసం బయట నుంచి వచ్చిన తర్వాత బకెట్‌లో నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల బేకింగ్ సోడా వేయాలి. ఇప్పుడు ఈ నీటిలో పాదాలను ఉంచి మధ్యమధ్యలో తేలికపాటి చేతులతో రుద్దండి. దీనివల్ల పాదాలు అందంగా తయారవుతాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.