Home Remedies for Cold: వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు చెక్‌ పెట్టండిలా..! ఈ పొడిని తేనెలో కలుపుకుని తాగితే..

వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందులో జలుబు, దగ్గు జ్వరం కూడా ఒకటి. ఒకసారి దగ్గు మొదలైదంటే, అది త్వరగా పోదు. దీనితో పాటు ఊపిరితిత్తులలో కఫం కూడా పేరుకుపోతుంది.

Home Remedies for Cold: వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుకు చెక్‌ పెట్టండిలా..! ఈ పొడిని తేనెలో కలుపుకుని తాగితే..
Home Remedies For Cold

Updated on: Jun 13, 2024 | 8:24 PM

వర్షాకాలం మొదలైంది. ఈ సీజన్‌లో రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అందులో జలుబు, దగ్గు జ్వరం కూడా ఒకటి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు మొదలైందంటే.. అది అంత త్వరగా పోదు. దీనితో పాటు ఊపిరితిత్తులలో కఫం కూడా పేరుకుపోతుంది. అలాగే, ఇంటిల్లిపాదిని వెంటాడుతుంది. మీరు దీర్ఘకాలిక దగ్గును వదిలించుకోవడానికి సమర్థవంతమైన ఇంటి నివారణల కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ కొన్ని బెస్ట్‌ హోం రెమిడీస్‌ ఉన్నాయి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి.

వర్షాకాలంలో వేధించే సీజనల్‌ సమస్యలకు తేనె అద్భుత హోం రెమిడీగా పనిచేస్తుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు కఫం నుండి ఉపశమనం పొందడంలో బాగా ఉపయోగపడతాయి. బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో తేనె ప్రభావవంతంగా ఉంటుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల తేనె మిక్స్ చేసి తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు జ్వరం, తలనొప్పి కూడా దూరమవుతాయి. ఉదయం, సాయంత్రం ఒక చెంచా తేనె తినడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

అంతే కాకుండా, అల్లం తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పచ్చి అల్లం తినడం లేదా దాని రసం తీసి తాగడం ద్వారా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ, దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..