Health Tips: అయ్యబాబోయ్.. రాత్రిపూట బ్రష్ చేయకపోతే ఇంత ప్రమాదమా.. షాక్ అవడం పక్కా..

పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే ఏమవుతుంది..? పళ్ళు పుచ్చిపోవడం, నోటి దుర్వాసన.. అంతే అనుకుంటున్నారా..? అసలు కథ వేరే ఉంది.. మీ నోటిలోని చిన్న బ్యాక్టీరియా, మీకు తెలియకుండానే గుండెకు పెద్ద ముప్పు తీసుకురాగలదు. ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రిపూట బ్రష్ చేయకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే షాక్ అవుతారు.

Health Tips: అయ్యబాబోయ్.. రాత్రిపూట బ్రష్ చేయకపోతే ఇంత ప్రమాదమా.. షాక్ అవడం పక్కా..
Missing Night Brushing Increases Heart Attack Risks

Updated on: Oct 26, 2025 | 12:28 PM

పడుకునే ముందు పళ్ళు తోముకోవడం ఒక టాస్క్‌లా అనిపించినా.. అది మీ నోటి ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. చాలా మంది అలసట లేదా బిజీ కారణంగా రాత్రిపూట బ్రష్ చేయడాన్ని పట్టించుకోరు. అయితే ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల కేవలం పంటి సమస్యలే కాక, గుండె సంబంధిత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇటీవలి వైద్య పరిశోధనల ప్రకారం.. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, ముఖ్యంగా రాత్రిపూట బ్రష్ చేయకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు కనుగొన్నారు. మన నోటి లోపల జరిగే బ్యాక్టీరియా ప్రభావం కాలక్రమేణా గుండె ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

పడుకునే ముందు బ్రష్ చేయడం ఎందుకు ముఖ్యం..?

రాత్రిపూట బ్యాక్టీరియా పెరగడం: మనం రోజంతా తిన్న ఆహారం పంటి సందుల్లో, చిగుళ్ళపై పేరుకుపోతుంది. రాత్రి బ్రష్ చేయకపోతే, ఆ ఆహారాన్ని తిని బ్యాక్టీరియా రాత్రంతా పెరుగుతుంది.

లాలాజలం తగ్గడం: మనం నిద్రపోతున్నప్పుడు నోట్లో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. లాలాజలం లేకపోతే ఈ హానికరమైన బ్యాక్టీరియా అలాగే ఉండిపోతేంది.

రక్తంలోకి బ్యాక్టీరియా: ఈ బ్యాక్టీరియా పెరిగి చిగుళ్ళ వాపు లేదా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అప్పుడు ఈ బ్యాక్టీరియా చిగుళ్ళ ద్వారా రక్తంలోకి వెళ్లిపోతుంది.

గుండెపై ప్రభావం: క్తంలోకి వెళ్లిన బ్యాక్టీరియా శరీరంలో మంటను పెంచుతుంది. ఈ దీర్ఘకాలిక మంట వల్ల గుండెకు సంబంధించిన రక్తనాళాలు గట్టిపడతాయి లేదా సన్నబడతాయి. దీనివల్ల గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అధ్యయనం ఏం చెబుతోంది?

యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం,, రాత్రిపూట పళ్ళు తోముకునే అలవాటు లేని వారికి రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేసే వారితో పోలిస్తే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నోటి శుభ్రతను పాటించడం గుండె జబ్బులను తగ్గిస్తుంది అని పరిశోధకులు నొక్కి చెప్పారు.

గుండె ప్రమాదాన్ని పెంచే దంత సమస్యలు:

నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యలు గుండె ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి:

గమ్ వ్యాధి: ఈ తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియా సులభంగా రక్తంలోకి ప్రవేశించి, శరీరంలో మంటను పెంచుతుంది. పీరియాంటైటిస్ ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదించింది.

కావిటీస్: లోతుగా ఉండే దంత క్షయం రక్తప్రవాహం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపించే ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

నోటి మంట: చిగుళ్ళలో నిరంతర వాపు లేదా ఎరుపు రంగు, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది.

నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సిఫార్సులు

రెండుసార్లు బ్రష్: ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో తప్పనిసరిగా బ్రష్ చేయండి.

ఫ్లాస్ వాడండి: బ్రష్ చేయని చోట ఉండే ఆహారాన్ని ఫ్లాస్ ఉపయోగించి తీయండి.

మౌత్ వాష్: యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్‌ను ఉపయోగించడం బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది.

డాక్టర్‌ను కలవండి: ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని కలిసి చెక్ చేయించుకోండి.

చెడు అలవాట్లు వద్దు: చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, డ్రింక్స్ తగ్గించండి. పొగతాగడం పూర్తిగా మానేయండి.

రాత్రిపూట బ్రష్ చేయడం అనేది కేవలం మీ చిరునవ్వు కోసం మాత్రమే కాదు.. మీ గుండెను కాపాడుకోవడానికి కూడా ఒక ముఖ్యమైన చిట్కా. దీన్ని ఇకపై నిర్లక్ష్యం చేయకండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..