AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్ల ఆస్తి, లక్షల్లో జీతమున్నా పెళ్లికి నో..! ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో తెలిస్తే షాక్

ఒకప్పుడు పెళ్లి సంబంధం కుదరాలంటే అబ్బాయి సంపాదన, ఆస్తిపాస్తులు, విదేశాల్లో ఉద్యోగం వంటి అంశాలే ప్రధాన అర్హతలుగా ఉండేవి. లక్షల్లో జీతం ఉంటే చాలు, పెళ్లి ఫిక్స్ అయిపోతుందని అప్పట్లో నమ్మేవారు. కానీ, కాలం మారింది. ఇప్పుడు పెళ్లిళ్ల మార్కెట్‌లో ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. కోట్ల జీతం కంటే, తలపై జుట్టు, స్మార్ట్ లుక్ ఉండటమే ప్రధానమని యువత తెగేసి చెబుతోంది. బాహ్య సౌందర్యమే ప్రామాణికంగా మారుతున్న ఈ కొత్త తరం ఆలోచనలపై ఇప్పుడు సమాజంలో పెద్ద చర్చే జరుగుతోంది.

కోట్ల ఆస్తి, లక్షల్లో జీతమున్నా పెళ్లికి నో..! ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో తెలిస్తే షాక్
Marriage Trends
Nikhil
|

Updated on: May 26, 2026 | 7:00 AM

Share

ప్రస్తుత పెళ్లి సంబంధాల వేటలో అబ్బాయి ఆర్థిక స్థోమత కంటే అతని రూపమే అమ్మాయిలకు ప్రధాన ఆకర్షణగా మారింది. అబ్బాయికి పెద్ద కంపెనీలో ఉద్యోగం ఉన్నా, బ్యాంకు బ్యాలెన్స్ కోట్లలో ఉన్నా సరే… చూడటానికి స్మార్ట్‌గా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా బట్టతల ఉన్న అబ్బాయిలకు సంబంధాలు దొరకడం గగనంగా మారిందని మ్యాచ్‌మేకర్లు అభిప్రాయపడుతున్నారు. అబ్బాయిల కెరీర్, తెలివితేటల కంటే వారి స్టైలింగ్, హెయిర్ స్టైల్, ఫిజిక్ వంటి అంశాలకే అమ్మాయిలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

పెళ్లి ఒక యుద్ధం..

ఒకప్పుడు సరైన ఉద్యోగం వస్తే పెళ్లి సులభంగానే అయ్యేది. కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద యుద్ధంగా మారింది. సరైన సంబంధం దొరకడానికే ఏళ్లు పడుతోంది. ‘పెళ్లి అవుతుందా? లేదా?’ అనే టెన్షన్ యువతలో ఆందోళన నింపుతోంది. కష్టపడి మంచి పొజిషన్‌కు చేరుకున్నా, కేవలం లుక్స్ బాలేవనే కారణంతో ఎదురవుతున్న రిజెక్షన్స్ అబ్బాయిల్లో అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. దీంతో కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన యువత, హెయిర్ ప్లాంటేషన్లు, బ్యూటీ ట్రీట్‌మెంట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అమ్మాయిల మైండ్‌సెట్‌లో మార్పు

ఇక ఇప్పుడు అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదివి, అబ్బాయిలతో సమానంగా సంపాదిస్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రులైన వారు, తమకు సమానంగా సంపాదించే వ్యక్తి కంటే, తమ పక్కన స్టైలిష్‌గా కనిపించే భాగస్వామిని కోరుకుంటున్నారు. ఆర్థిక భద్రత కంటే బాహ్య సౌందర్యానికే ఓటేస్తున్నారు. బాహ్య అందం తాత్కాలికమే అయినా, ప్రస్తుత జనరేషన్ మాత్రం దాన్నే ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. ఏది ఏమైనా, పెళ్లి అనే బంధంలో కేవలం రూపానికే పెద్దపీట వేసే ఈ ట్రెండ్ మున్ముందు సమాజంలో ఇంకెన్ని మార్పులు తెస్తుందో చూడాలి. ఆకర్షణ మాత్రమేనా, బంధం నిలబడాలంటే పరస్పర గౌరవం కూడా ముఖ్యమనే నిజాన్ని ఈ తరం ఎప్పుడు గుర్తిస్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us