నాలుగే నాలుగు వారాలు టీకి దూరంగా ఉండి చూడండి..! శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..

వీటికి దూరంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు హాయిగా నిద్రపోవచ్చని, అలాగే తొందరగా పడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నాలుగు వారాల పాటు టీ, కాఫీలకు దూరంగా ఉన్నవారు ఎక్కువగా నిద్రపోయినట్లు, అలాగే తొందరగా పడుకున్నట్లు పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అంతేకాదు..

నాలుగే నాలుగు వారాలు టీకి దూరంగా ఉండి చూడండి..! శరీరంలో జరిగే మార్పులు ఊహించలేరు..
Tea

Updated on: May 05, 2025 | 12:02 PM

మనదేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ చాయ్‌ ప్రియులే అని చెప్పాలి. ఎందుకంటే..దాదాపు అందరూ పొద్దున నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీ లాగించేస్తూనే ఉంటారు. ఉదయం నిద్రలేవగానే కప్పు కాఫీ, లేదా టీ కడుపులో పడకపోతే, బండికి ముందుకు సాగని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి చాలా మంది టీ తాగుతుంటారు. తలనొప్పిని తగ్గించుకోవడానికి కూడా చాలా మంది చాయ్‌ తాగుతుంటారు. ఏ ఇద్దరు స్నేహితులు కలిసినా కూడా ముందుగా కలిసేది టీ తోనే..అలాంటి టీ తో లాభాలు సరే.. నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలను పూర్తిగా తాగడం మానేయడం వల్ల మన శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

నెలరోజులు టీ తాగకపోతే నిద్ర నాణ్యత పెరుగుతుంది. టీ, కాఫీ అలవాటు మానేసిన వారిలో ముఖ్యంగా ఒక నెల రోజుల పాటు టీ, కాఫీలను తాగడం మానేస్తే నిద్రలేమి సమస్య ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. . వీటికి దూరంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు హాయిగా నిద్రపోవచ్చని, అలాగే తొందరగా పడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నాలుగు వారాల పాటు టీ, కాఫీలకు దూరంగా ఉన్నవారు ఎక్కువగా నిద్రపోయినట్లు, అలాగే తొందరగా పడుకున్నట్లు పలు అధ్యయనాలు కూడా వెల్లడించాయి. అంతేకాదు..

ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలను తాగకపోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని చెప్పారు. నెల పాటు టీ తీసుకోకపోవడం ద్వారా రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, షుగర్‌ లెవల్స్‌ కూడా అదుపులో ఉంటాయని చెప్పారు. టీ, కాఫీలకు దూరంగా ఉన్నవారిలో గతంకంటే చురుకుగా, హైడ్రేటెడ్‌గా ఉంటారు. టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు వెంటాడుతున్నాయి. నెల పాటు టీ తాగకపోతే దంతాల పసుపు సమస్య ఉండదు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..