పురుషుల్లో దాగున్న బ్రహ్మాస్త్రం ఇదేనట..! మహిళలను ఎక్కువగా ఆకర్షించేది ఏంటో తెలుసా..

|

Mar 07, 2024 | 11:51 AM

చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మాత్రమే కాకుండా.. ప్రధానంగా పురుషులు.. మహిళలను (మగ/ఆడ) ఆకర్షించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన ప్రకారం, ఇతర జీవుల వలె, మానవ చెమటకు కూడా ఒక ప్రత్యేక వాసన ఉంటుంది.

పురుషుల్లో దాగున్న బ్రహ్మాస్త్రం ఇదేనట..! మహిళలను ఎక్కువగా ఆకర్షించేది ఏంటో తెలుసా..
Relationship Tips
Follow us on

చెమట శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మాత్రమే కాకుండా.. ప్రధానంగా పురుషులు.. మహిళలను (మగ/ఆడ) ఆకర్షించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన ప్రకారం, ఇతర జీవుల వలె, మానవ చెమటకు కూడా ఒక ప్రత్యేక వాసన ఉంటుంది. ఇది వ్యతిరేక లింగానికి చెందిన (మగ/ఆడ) శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. పురుషుల చెమటలో ఉండే ఆండ్రోస్టాడియోనోన్ అనే ప్రత్యేక మూలకం మహిళల్లో కార్టిసాల్ స్థాయిలను పెంచుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ పరిశోధకులు కనుగొన్నారు. కార్టిసాల్ ఒక ఒత్తిడి హార్మోన్, కానీ ఆసక్తికరంగా, మహిళల్లో దాని పెరుగుదల వారి మానసిక స్థితి, లైంగిక ప్రేరేపణను కూడా ప్రభావితం చేస్తుంది.

పరిశోధన ఫలితాలు..

అధ్యయనం సమయంలో పరిశోధకులు పురుషుల చెమట నుంచి సేకరించిన ఈ ప్రత్యేక రసాయన పదార్థాన్ని వాసన కోసం మహిళలకు అందించారు. దీని తర్వాత మహిళల రక్తంలో కార్టిసాల్ స్థాయిలను పరిశీలించారు. ఫలితంగా, ఈ వాసనను పసిగట్టని స్త్రీల కంటే ఈ సువాసనను పసిగట్టిన మహిళల్లో కార్టిసాల్ స్థాయిలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.

పరిశోధకులు ఏమంటున్నారంటే..

మానవులలో కూడా వాసన ద్వారా సిగ్నల్ మార్పిడి (ఫెరోమోన్ కమ్యూనికేషన్) జరుగుతుందనడానికి ఈ పరిశోధన రుజువు అని అధ్యయనం ప్రధాన పరిశోధకురాలు డాక్టర్ క్లైర్ వియార్ట్ చెప్పారు. ఉదాహరణకు, ఎలుకలు, సీతాకోకచిలుకలలో వాసన ద్వారా సంకేతాలు మార్పిడి అవుతాయి. దీనిద్వారా వాటి ప్రవర్తన ప్రభావితమవుతుంది. అదేవిధంగా, మానవ సువాసన జీవశాస్త్రపరంగా, బహుశా మానసికంగా వ్యతిరేక లింగాన్ని కూడా ప్రభావితం చేస్తుందని మా అధ్యయనం చూపిస్తుందన్నారు.

మరింత పరిశోధన అవసరం..

ఈ పరిశోధనకు మరింత లోతైన అధ్యయనం అవసరం. అయినప్పటికీ, ఈ అధ్యయనం మానవ ఆకర్షణ అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ, ఇందులో వాసన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పింది.. అయితే.. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం జరగాల్సి ఉందని పలువురు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లకి్ చేయండి..