గర్భిణులకు సౌ౦దర్య సాధనాలతో హాని

| Edited By: Srinu

Mar 07, 2019 | 5:21 PM

లిపిస్టిక్‌లు, మాయిశ్చరైజర్లు తదితర సౌందర్య సాధనాలను వినియోగిస్తే… వాటిలోని రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట! పైగా వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలూ చుట్టుముట్టవచ్చని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో…అధర, చర్మ లేపనాలు తదితర సౌందర్య సాధనాల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయని, గర్భిణులు వీటిని వినియోగిస్తే… వారికి పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై దృష్టి సారించింది. 11 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో కదలికలకు […]

గర్భిణులకు సౌ౦దర్య సాధనాలతో హాని
Follow us on

లిపిస్టిక్‌లు, మాయిశ్చరైజర్లు తదితర సౌందర్య సాధనాలను వినియోగిస్తే… వాటిలోని రసాయనాల కారణంగా పుట్టే బిడ్డల్లో శారీరక కదలికలు తక్కువయ్యే ప్రమాదముందట! పైగా వారు ఎదిగే క్రమంలో తీవ్రస్థాయి మానసిక సమస్యలూ చుట్టుముట్టవచ్చని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కొలంబియా విశ్వవిద్యాలయం చేసిన సర్వేలో…అధర, చర్మ లేపనాలు తదితర సౌందర్య సాధనాల్లో సథాలేట్స్‌ అనే రసాయనాలుంటాయని, గర్భిణులు వీటిని వినియోగిస్తే… వారికి పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న దానిపై దృష్టి సారించింది. 11 ఏళ్ల వయసున్న బాలబాలికల్లో కదలికలకు సంబంధించి ‘బాట్‌-2’ పరీక్షలు నిర్వహించింది. వారిలో కొందరు చురుగ్గా లేకపోవడం, తమ పనులను తాము స్వయంగా చేసుకోలేకపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. కారణమేంటని ఆరా తీస్తే… వారి తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు ప్రమాదకర రసాయనాలతో కూడిన సౌందర్య సాధనాలను విరివిగా వాడేవారని తేలింది. అ౦దుకే వారికి పుట్టే పిల్లలు యుక్తవయసుకు వచ్చే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతారు. చురుగ్గా కదల్లేరు. పైపెచ్చు ఆత్మన్యూనత, తీవ్రస్థాయి ఆందోళన, వ్యాకులత, ప్రవర్తన సంబంధ సమస్యలు వారిని చుట్టుముట్టే ప్రమాదముంది.