Cauliflower: కాలీఫ్లవర్ తింటున్నారా.. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు ఇది తినొద్దు.. అవి ఏమిటంటే..

ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. అయితే సీజనల్‌ వాటిని తినడంపై దృష్టి పెడుతున్నారు.

Cauliflower: కాలీఫ్లవర్ తింటున్నారా.. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు ఇది తినొద్దు.. అవి ఏమిటంటే..
Cauliflower

Updated on: Feb 16, 2022 | 7:45 AM

ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరిగింది. అయితే సీజనల్‌ వాటిని తినడంపై దృష్టి పెడుతున్నారు. మనకు ప్రతి సీజన్‌లో క్యాలీఫ్లవర్‌(Cauliflower)ను మార్కెట్‌లో దొరుకుతుంది.. శీతాకాలం(winter)లో ప్రధానంగా కాలీఫ్లవర్ అధికంగా మార్కెట్‌లోకి లభిస్తుంటుంది. క్యాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్పరస్, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు,ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు, విటమిన్ ఎ, బి, సి,పొటాషియం కూడా ఉంటుంది. అయితే కొంతమంది క్యాలీఫ్లవర్‌ను తినకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ వ్యక్తులు తినకూడదో తెలుసుకోండి.

మీరు థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే కాలీఫ్లవర్ తీసుకోవడం మానేయండి. దీన్ని తీసుకోవడం వల్ల మీ T3,T4 హార్మోన్లు పెరుగుతాయి. మూత్రాశయం, కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, మీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కాలీఫ్లవర్ తినవద్దు. అటువంటి పరిస్థితిలో దీనిని తీసుకోవడం ద్వారా మూత్రపిండాలు, మూత్రాశయంలో ఉన్న మూత్రపిండాల సమస్య వేగంగా పెరుగుతుంది. అదనంగా యూరిక్ యాసిడ్ స్థాయి కూడా వేగంగా పెరుగుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు కాలీఫ్లవర్ తినకూడదు. ఇందులో పిండి పదార్థాలు ఉంటాయి. దీని వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది.

గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Read also.. Drumstick Leaves: ఇది ఆకుకూర కాదు.. ఆకుపచ్చ బంగారం.. ఎన్నో వ్యాధులకు సహజ ఔషధం..