Wrinkles Remedies: చ‌ర్మంపై ముడ‌త‌లు తగ్గాలంటే.. ఈ 3 ఆకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.. ఇలా వాడితే యవ్వనంగా కనిపిస్తారు..

|

Apr 08, 2024 | 11:42 AM

ముడతలను వదిలించుకోవడానికి చాలా మంది వివిధ చికిత్సలు, ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. ఇవి ఖరీదైనవి. పైగా వాటితో అనేక ఇతర దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. మీరు ముడుతలను తొలగించడానికి సహజ పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆకులు మీకు సహాయపడతాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Wrinkles Remedies: చ‌ర్మంపై ముడ‌త‌లు తగ్గాలంటే..  ఈ 3 ఆకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.. ఇలా వాడితే యవ్వనంగా కనిపిస్తారు..
Wrinkles Remedies
Follow us on

వయస్సు పెరిగేకొద్దీ చర్మం ముడతలు రావడం సహజమే. కానీ, ఈ రోజుల్లో చిన్న వయస్సులోనే చాలా మంది ముఖాల్లో ముడతలు రావడం ప్రారంభించాయి. చర్మ సంరక్షణ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి, కాలుష్యం మొదలైన అనేక అంశాలు దీనికి కారణం కావచ్చు. ముడతలను వదిలించుకోవడానికి చాలా మంది వివిధ చికిత్సలు, ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. ఇవి ఖరీదైనవి. పైగా వాటితో అనేక ఇతర దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. మీరు ముడుతలను తొలగించడానికి సహజ పరిష్కారం కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆకులు మీకు సహాయపడతాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1. వేప ఆకులు..

వేప ఆకులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం ద్వారా ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. రంగు మెరుగుపడుతుంది. ముడతలు కూడా తొలగిపోతాయి. వేప ఫేస్ ప్యాక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు..ముందుగా వేప ఆకులను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి పెరుగుతో రుబ్బుకోవాలి. లేదంటే, ముందుగా ఆకులను మెత్తగా రుబ్బుకుని, ఆపై పెరుగు కలిపినా సరే. ఎలాగైనా సరై. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత సాధారణ నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయటం వల్ల మీ ముఖంలో కాంతిని మీరు గమనిస్తారు.

ఇవి కూడా చదవండి

2. తులసి ఆకులు ..

తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ రింక్ల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిని ఉపయోగించాలంటే తులసి ఆకుల రసాన్ని తీసి ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. తులసి రసంతో ప్రభావాన్ని మరింత మెరుగుపరచడానికి ఇందులో అలోవెరా జెల్ కూడా కలిపి వాడితే ఫలితం ఉంటుంది. తులసి రసంతో పాటు అలోవెరా జెల్‌ని బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముడతలు తగ్గాలంటే వారానికోసారి అప్లై చేస్తే సరిపోతుంది.

3. జామ ఆకులు..

జామ ఆకులు బొబ్బలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా ముడతల సమస్యను కూడా దూరం చేస్తాయి. ఇందుకోసం ముందుగా జామ ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. దానికి పెరుగు వేసి పేస్ట్‌ను సిద్ధం చేయండి. దీన్ని ముఖానికి మంచి ప్యాక్‌లా అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..