Belly Fat: బొడ్డు చుట్టూ ఉండే కొవ్వును బెల్లీఫ్యాట్ అంటారు. దీనిని కరిగించడం చాలా కష్టం. అంతేకాదు ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. దీనివల్ల గుండె జబ్బులు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరుగుతుంది. అధిక బీపీ, మధుమేహం, ఒత్తిడి సమస్యలు ఏర్పడుతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆధునిక కాలంలో చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మీరు వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఆహారంలో ఈ 5 మార్పులు చేస్తే సరిపోతుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. మీరు ఉదయమే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ప్రతిరోజు తాగండి. కొద్ది రోజుల్లో, పొట్ట చుట్టూ మాత్రమే కాకుండా శరీరంలో అన్ని చోట్లా నిల్వ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది.
2. బరువును నియంత్రించడానికి, కొవ్వు కరిగించడానికి అజ్వైన్ నీరు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు ఇది గ్యాస్, అజీర్ణం, అసిడిటీ మొదలైన సమస్యలను పరిష్కరిస్తుంది. కొన్ని రోజుల్లోనే మీరు తేడాను చూస్తారు.
3. ఉదయం అల్పాహారం తీసుకోకుంటే చాలామంది బరువు తగ్గవచ్చని అనుకుంటారు కానీ ఇది తప్పు. బరువు తగ్గడానికి బదులు విపరీతంగా పెరుగుతారు. కాబట్టి ఉదయం పూర్తి అల్పాహారం తీసుకోండి. మొలకలు, ఉప్మా, ఇడ్లీ, మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోండి. బ్రెడ్ తినవద్దు. తప్పదనుకుంటే బ్రౌన్ బ్రెడ్ తినండి.
4. మీ పొట్ట, నడుము సన్నబడాలని కోరుకుంటే గోధుమ రోటీకి కొంతకాలం వీడ్కోలు పలకండి. దానికి బదులుగా బార్లీ, పప్పు పిండితో చేసిన రోటీలను తినండి.
5. మీ ఆహారంలో పచ్చి కూరగాయలు, సలాడ్లు, జ్యుసి పండ్లను ఎక్కువగా చేర్చండి. పగటిపూట మీకు ఆకలిగా అనిపించినప్పుడు పండు లేదా సలాడ్ తినండి. కొన్ని రోజులు ఈ నియమాలను పాటించడం ద్వారా బెల్లీఫ్యాట్ వేగంగా కరగుతుంది.