Weight Gain: సన్నగా ఉన్నారా? ఎంత తిన్నా లావు కావట్లేదా? ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే 15 రోజుల్లో రిజల్ట్!
చాలామందికి బరువు తగ్గడం ఓ కలగానే మిగిలిపోతుంది. కానీ బరువు తగ్గడమే కాదు, పెరగడం కూడా అంత తేలిక కాదు. సన్నగా పీలగా ఉండేవారు ఎంత తిన్నా ఒపట్టాన ఒంటికి పట్టరు. బలం, కండ పెంచుకోవాలని లక్ష్యం పెట్టుకున్న వారికి సరైన ఆహారం, పోషణ చాలా ముఖ్యం. శరీరానికి బలం, కండ పట్టడానికి అత్యధిక ప్రోటీన్, పోషక విలువలు ఉన్న కొన్ని ఆహారాలు ఎలా సహాయపడతాయో నిపుణుల సూచనలతో తెలుసుకుందాం.

శరీరానికి బలం, కండ పట్టాలి అనుకునేవారికి ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అవసరం. జంక్ ఫుడ్ తిని ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే బదులుగా ఆరోగ్యంగా కూడా బరువు పెరగవచ్చు. అందుకు మీ డైట్లో అధిక ప్రోటీన్, మంచి కొవ్వులు ఉన్న పదార్థాలు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆ వివరాలేంటో ఇందులో చూడండి..
1. వేరుశనగతో అద్భుత బలం
రాత్రిపూట నానబెట్టిన వేరుశనగను ఉదయం తింటే ఎంతో బలం వస్తుంది. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
2. కొబ్బరి, మొలకలు, నట్స్
కండ పట్టాలని అనుకునేవారు పచ్చికొబ్బరిని ఎక్కువగా తినాలి. మొలకలతో పాటు ఉదయం పచ్చికొబ్బరి తినవచ్చు. వీటితో పాటు 12 గంటలు నానబెట్టిన జీడిపప్పు, బాదాం పప్పు తినడం కూడా బలాన్నిస్తుంది.
3. ముడి బియ్యం పాలిష్ పట్టని ముడి బియ్యం అన్నం మద్యాహ్నం తినాలి. ఇందులో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, జీర్ణ శక్తికి తోడ్పడతాయి.
4. సోయాచిక్కుడు శక్తి
కండ పట్టాలి అనుకునేవారికి సోయాచిక్కుడు గింజలు చాలా కీలకం. ఈ గింజలను 15 గంటలు నానబెట్టి అన్ని కూరలలో వేసుకోవచ్చు. లేదా అన్నంలో కూడా కలపవచ్చు.
సోయా గింజలలో 35 నుండి 40 శాతం ప్రోటీన్స్ ఉంటాయి. అన్ని గింజలలో కంటే ఎక్కువ ప్రోటీన్స్ కలిగిన గింజ సోయా.
జాగ్రత్త: సోయాచిక్కుడు వలన గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. కావున సోయా రాత్రికి తినవద్దు. గ్యాస్ సమస్య ఉన్నవారు అది తగ్గించుకొని సోయ వాడాలి.
5. ఆహార సమతుల్యత
బరువు పెరగాలని అనుకునేవారు కేవలం ప్రోటీన్లే కాదు, సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం. నిపుణుల సలహా మేరకు ఆహార ప్రణాళికను తయారు చేసుకోవడం ఉత్తమం.
గమనిక: ఈ ఆహార చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. దయచేసి మీ ఆహార ప్రణాళికలో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు తప్పనిసరిగా పోషకాహార నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించండి.




