Beauty Tips : చర్మాన్ని కాంతివంతంగా అందంగా చేయడానికి సహజ మూలికలు, నూనెలు చక్కగా ఉపయోగపడుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. సహజమైన మూలికలు, నూనెలను కలపడం ద్వారా కుంకుమడి తైలం తయారు చేశారు. ఇది ఆయుర్వేద నూనె చర్మానికి మెరుపును అందించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మంపై ఫేషియల్, మాయిశ్చరైజర్, క్లెన్సర్, టోనర్‌గా పనిచేస్తుంది. ఇది చర్మానికి సంబంధించి ఈ 4 సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.
1. సహజ కాంతి
ఈ నూనెను సహజ, సేంద్రీయ మూలికలను కలపడం ద్వారా తయారు చేస్తారు. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మంలో రక్త ప్రసరణను పెంచడానికి, కణాలను పోషించడానికి పనిచేస్తాయి. ఇది మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా ఉంచడానికి సహాయపడుతుంది.
2. స్కిన్ టోన్‌ను ప్రకాశవంతం చేస్తుంది
మీ బ్యూటీ ప్రొడక్ట్స్‌లో కుంకుమడి నూనెను చేర్చడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా చర్మాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఇది చర్మ రంగును ప్రకాశవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల ముడతలు తొలగిపోతాయి.
3. చర్మం వాపును తగ్గిస్తుంది
కుంకుమడి నూనెలో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఈ నూనెలో ఉండే మూలికలు దురద, మంట, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడతాయి. టీ ట్రీ ఆయిల్‌తో కలిపి ఈ నూనెను రెగ్యులర్‌గా అప్లై చేయడం ద్వారా చర్మంపై మంట, ముఖంపై మచ్చలు తగ్గుతాయి.
4. మొటిమలను తొలగిస్తుంది
కుంకుమడి నూనె చర్మంపై మొటిమలను తొలగిస్తుంది. ఈ నూనె చర్మంలో క్లెన్సర్ లాగా పనిచేస్తుంది. ఇది చర్మంలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ వదిలించడానికి సహాయపడుతుంది.