మన దేశంలో తమలపాకులకు (Betel Leaves) ప్రత్యేకమైన స్థానం ఉంది.. వ్రతాలలో .. దేవుడి ఆరాధనలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు.. అలాగే తమలపాకులను మన దేశంలో చాలా మంది తినేస్తుంటారు. వీటిని తినడం వలన ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ తమలపాకులతో ఆరోగ్యానికి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దేశంలో అతిథులకు పాన్ తినిపించే సంప్రదాయం శతాబ్ధాలుగా కొనసాగుతుంది. తమలపాకులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇండియా టుడేలో ప్రచురించబడిన ఓ కథనం ప్రకార.. తమలపాకులలో టానిన్లు, ప్రొపేన్, ఆల్కలాయిడ్స్, ఫినైల్ ఉన్నాయి. ఇవి శరీరంలో నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. తమలపాకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.
తమలపాకులను నమలడం జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి బయటపడాలంటే తమలపాకులను నమిలి తినాలి. అల్సర్ వంటి వ్యాధులను నయం చేయడంలో మేలు చేస్తాయి.
చిగుళ్ల వాపును తగ్గిస్తుంది.. చిగుళ్లలో వాపు లేదా గడ్డ వంటి సమస్యలు ఉంటే వారు వెంటనే తమలపాకులను తినాలి.. ఈ ఆకుల్లో ఉండే మూలకాలు చిగుళ్ల వాపును తగ్గిస్తాయి. చిగుళ్లలో పెరిగిన గడ్డలను నయం చేస్తాయి.
మధుమేహం అదుపులో ఉంటుంది.. తమలపాకులను తీసుకోవడం ద్వారా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. తమలపాకులను నమలడం వలన మధుమేహాన్ని నియంత్రించడానికి సహయపడుతుంది.
దంతాలకు మేలు చేస్తుంది. తమలపాకులు, పొగాకు, పచ్చిమిర్చి, సున్నం కలుపుకుని తింటారు.. ఈ వస్తువులు లేకుండా కేవలం తమలపాకులను నమలడం దంతాలకు చాలా మంచిది.
తమలపాకులను నమలడం వలన జలుబు, అలర్జీ, తలనొప్పి, వాపు, శరీరంలోని ఏదైనా భాగంలో గాయం వంటి సాధారణ సమస్యలను తగ్గించడంలో సహయపడుతుంది. తమలపాకులో తేనె కలిపి తింటే జలుబు వంటి వ్యాధులు నయమవుతాయి. ఏదైనా గాయం అయినప్పుడు వీటిని తినడం మంచిది.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.. దీనిని టీవీ 9 తెలుగు దృవీకరించలేదు.. అమలు చేసే ముందు వైద్యులను సంప్రదించాలి.