Red Banana Health Benefits: ఇది పండు కాదు.. అమృతఫలం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

అరటి పండు.. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి అమృఫలం. సీజన్‌తో సంబంధం లేకుండా.. అందరికీ అందుబాటు ధరలో లభిస్తుంది. అరటి పండు ఎనర్జీ బూస్టర్‌ ఫుడ్. ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ రకాల అరటి పండ్లు ఉన్నాయని మీకు తెలుసా.? పసుపు పచ్చవి, చక్కెరకేళి, కొండ అరటి పండ్లు, అమృతపాణి, ముకిరీ, కర్పూరం, కర్పూర చక్కెర కేళీ వంటి కొన్ని రకాలు మనం తరచూ చూస్తుంటాం. మార్కెట్లో ఎర్రటి అరటిపండ్లు కూడా కనిపిస్తుంటాయి. ఎర్రగా నిగనిగలాడుతూ.. ఆకర్షణీయంగా కనిపించే ఈ అరటిపండులో పోషకాలూ మెండుగా ఉంటాయి.

Red Banana Health Benefits: ఇది పండు కాదు.. అమృతఫలం..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
Red Banana

Updated on: Oct 31, 2025 | 2:10 PM

సాధారణ అరటి పండుతో పోలిస్తే..ఎర్ర అరటి పండులో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎర్రటి అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఎర్ర అరటిపండ్లలో లభించే పొటాషియం, మన శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది సాధారణ హృదయ స్పందన రేటును నిర్వహించడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఎర్ర అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ మెరుగుపరచడంలో ఎర్ర అరటి సహాయపడుతుంది.

ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి అహారంగా చెబుతున్నారు.. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. అందువల్ల అతిగా తినడం మానేస్తారు. ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా విటమిన్ బి6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..