Curry Leaves : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..!

కరివేపాకు.. వంటలకు కమ్మటి సువాసనను అందిస్తుంది. అందుకే దాదాపు అందరూ కరివేపాకును వంటల్లో విరివిగా వాడుతుంటారు. కరివేపాకును కేవలం వంటకు మంచి వాసన కోసం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకుతో హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు.. బోలెడన్నీ బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో చాలా మంది ఉదయాన్నే నాలుగైదు కరివేపాకు రెమ్మలు నోట్లో వేసుకుని తింటున్నారు. అలాగే, మరికొందరు కరివేపాకు టీ తయారు చేసుకుని తీసుకుంటున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Curry Leaves : ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటున్నారా..? శరీరంలో జరిగేది ఇదే..!
కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అయితే, ఎక్కువగా తింటే మాత్రం డయేరియా వస్తుంది. కరివేపాకు తింటే ప్రోటీన్ లోపం, ఐరన్ లోపం సమస్యలు దూరమవుతాయి. కరివేపాకులో విటమిన్ బి12, విటమిన్ ఇ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

Updated on: Aug 07, 2025 | 5:22 PM

కరివేపాకు.. వంటలకు కమ్మటి సువాసనను అందిస్తుంది. అందుకే దాదాపు అందరూ కరివేపాకును వంటల్లో విరివిగా వాడుతుంటారు. కరివేపాకును కేవలం వంటకు మంచి వాసన కోసం మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకుతో హెల్త్ బెనిఫిట్స్ మాత్రమే కాదు.. బోలెడన్నీ బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో చాలా మంది ఉదయాన్నే నాలుగైదు కరివేపాకు రెమ్మలు నోట్లో వేసుకుని తింటున్నారు. అలాగే, మరికొందరు కరివేపాకు టీ తయారు చేసుకుని తీసుకుంటున్నారు. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తీసుకోవటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కరివేపాకులో బోలెడు పోషకాలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. కరివేపాకు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మన జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కరివేపాకు తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి ఐరన్ లోపం తగ్గుతుంది. ఇందులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని ఆహారంలో తీసుకుంటే చాలా లాభాలున్నాయి. పచ్చి కరివేపాకుని నమిలితే చాలా లాభాలున్నాయి.

కరివేపాకును మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనకు విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు అజీర్ణాన్ని తగ్గిస్తాయి. అంతే కాదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. కరివేపాకులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. కరివేపాకు తినడం వల్ల జుట్టు నల్లగా, మెరిసేలా చేస్తుంది. అవి చుండ్రు సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తాయి. కరివేపాకులో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గటానికి కూడా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..