Vastu Rules: అద్దం గురించి అసలు నిజాలు తెలుసుకోండి..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..

Vastu Rules: అద్దం ముఖం చూసుకోవడానికే కాదు అదృష్టం కోసం కూడా ఉపయోగపడుతుంది. అవును మీరు విన్నది నిజమే. వాస్తు ప్రకారం అద్దం సరైన దిశలో లేదా ఇంటి గోడకి

Vastu Rules: అద్దం గురించి అసలు నిజాలు తెలుసుకోండి..! లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవు..
Mirror

Updated on: Aug 30, 2021 | 6:04 PM

Vastu Rules: అద్దం ముఖం చూసుకోవడానికే కాదు అదృష్టం కోసం కూడా ఉపయోగపడుతుంది. అవును మీరు విన్నది నిజమే. వాస్తు ప్రకారం అద్దం సరైన దిశలో లేదా ఇంటి గోడకి ఉంచినట్లయితే సానుకూల శక్తి ప్రవహిస్తుంది. అదే తప్పు దిశలో ఉంచినట్లయితే దానిపై పడే చిత్రం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. దీని కారణంగా ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతారు. అసలు వాస్తు ప్రకారం అద్దం ఏ దిశలో ఉంచాలి అనే విషయాలను ఈ రోజు తెలుసుకుందాం.

1. అద్దాన్ని అమర్చుతున్నప్పుడు ఎక్కడా విరిగిపోకూడదు, పగుళ్లు రాకూడదని గుర్తుంచుకోండి.
2. వాస్తు ప్రకారం ఇంటి గోడపై ఉన్న అద్దం చాలా కిందికి కానీ చాలా ఎత్తులో కానీ ఉండకూడదు.
3. అద్దంలో ముఖం చూసుకునేటప్పుడు అందాన్ని పెంపొందించాలని, సానుకూల శక్తిని ఉత్పత్తి చేయాలని కోరుకోండి. ఈ కారణంగా వాస్తు దోశం ఉంటే తొలగిపోతుంది.
4. కిటికీ లేదా తలుపు ముందు అద్దం ఎప్పుడూ ఉంచవద్దు. ఎందుకంటే అది అద్దం నుంచి ఉత్పత్తి చేసిన పాజిటివ్‌ శక్తిని బయటకు పంపుతుంది.
5. ఇంటి మూలలో, లైటింగ్ సరిగ్గా లేని దగ్గర అద్దం పెట్టకూడదు.
6. మీ ఇంటి బయట టెలిఫోన్, పెద్ద చెట్టు, విద్యుత్ స్తంభం మొదలైనవి వాస్తు దోశానికి కారణమైతే మీరు కుంభాకార అద్దం ఉంచడం ద్వారా దోశాన్ని పోగొట్టవచ్చు.
7. అద్దం ఆగ్నేయంలో దక్షిణ గోడపై ఉంచినట్లయితే వ్యాపారంలో లాభాలు ఉంటాయి.
8. వాస్తు ప్రకారం ఉదయం లేచిన వెంటనే అద్దం వైపు అస్సలు చూడకూడదు..
9. ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుందని గుర్తించండి.

అలాగే.. ఇంటి నిర్మాణానికి వాస్తు చాలా ముఖ్యం. లేదంటే ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవు. కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారు. దరిద్రం తాండవిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఉన్నంతలో వాస్తు నియమాలు పాటించి గృహనిర్మాణం చేస్తారు. మరికొంత మంది కట్టిన ఇళ్లను కూల్చవేసి వాస్తు ప్రకారం కుడుతున్నారు. ఏ ఇంటికైనా వాస్తు కరెక్ట్‌గా ఉంటేనే అది కలకాలం నిలుస్తుంది.

Viral Video: ఈ చేప ఎంత లక్కీనో.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.. క్షణకాలంలో చావు తప్పింది

పండగొస్తే పెను ప్రమాదం.. టెర్రర్ సృష్టిస్తున్న డెల్టా వైరల్ వ్యాప్తి..: Delta Corona Effect Live Video.

INDW vs AUSW: ఆస్ట్రేలియా చేరిన టీమిండియా మహిళల జట్టు.. విమానంలో సందడే సందడి