మానసిక, శారీరక ప్రశాంతత కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలపండి.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

|

Jul 23, 2024 | 6:07 PM

చాలా మంది ప్రజలు స్నానం చేసే నీటిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదని భావించి సాధారణ నీటితో స్నానం చేస్తారు. స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా అనేక భౌతిక ప్రయోజనాలను పొందవచ్చు. స్నానం చేసే నీటిలో వీటిని కలపడం ద్వారా పూర్తిగా తాజాగా అనుభూతి చెందుతారు. అంతేకాదు అలసట అంతా ఒక్కసారిగా పోతుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.స్నానపు నీళ్లలో వేటిని కలుపుకోవడం వలన ఏయే ప్రయోజనాలు పొందవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం..

మానసిక, శారీరక ప్రశాంతత కోసం స్నానం చేసే నీటిలో వీటిని కలపండి.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
Essential Oils
Follow us on

స్నానం ఒక విధమైన విశ్రాంతిని మానసిక శారీరక ప్రశాంతతను ఇస్తుంది. అందుకనే పొద్దున్న నిద్ర లేచిన వెంటనే స్నానం చేయడం లేదా బయట నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. ఇలా చేయడం వలన భిన్నమైన ప్రశాంతి పొందిన అనుభూతి లభిస్తుంది. రోజంతా అలసట పోయి మనసు కూడా పూర్తిగా రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. చాలా సార్లు రోజంతా బయట ఉండటం వల్ల, తలనొప్పి , శరీర నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో స్నానం చసె ముందు ఆ నీటిలో కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. స్నానం చేసే నీటిలో వీటిని కలపడం ద్వారా పూర్తిగా తాజాగా అనుభూతి చెందుతారు. అంతేకాదు అలసట అంతా ఒక్కసారిగా పోతుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల అలసట తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. స్నానం చేసే నీళ్లలో కొన్ని రకాల వస్తువులను కలపడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి.

చాలా మంది ప్రజలు స్నానం చేసే నీటిలో ఏమీ కలపాల్సిన అవసరం లేదని భావించి సాధారణ నీటితో స్నానం చేస్తారు. స్నానం చేసే నీటిలో కొన్ని పదార్థాలను కలపడం ద్వారా అనేక భౌతిక ప్రయోజనాలను పొందవచ్చు. స్నానపు నీళ్లలో వేటిని కలుపుకోవడం వలన ఏయే ప్రయోజనాలు పొందవచ్చునో ఈ రోజు తెలుసుకుందాం..

పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌
స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను జోడించడం ద్వారా అలసట వెంటనే పోతుంది. అంతేకాదు స్నానం చేసిన వెంటనే పూర్తిగా రిఫ్రెష్‌ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ నూనె శరీరాన్ని చల్లబరుస్తుంది. మనస్సును రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. అయితే ఈ నూనెను నీటిలో రెండు చుక్కల కంటే ఎక్కువ వేయకూడదు అని గుర్తుంచుకోండి. పిప్పరమింట్ ఆయిల్ అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంది. కనుక ఇది తలనొప్పి, మైగ్రేన్ నుంచి ఉపశమనం ఇవ్వడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పసుపు
పసుపు దీని శోథ నిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. పసుపుని నీటిలో వేసి స్నానం చేయడం వల్ల ఎక్కడైనా గాయాలు ఉంటే త్వరగా మానిపోతాయి. అయితే పసుపు కలిపినా నీటితో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలను పొందడానికి.. స్నానం చేసే నీటిలో పసుపు వేసి సుమారు 15 నిమిషాలు వదిలివేయండి. దీని తర్వాత నీరు రంగు లేత పసుపు రంగులోకి మారుతుంది. అప్పుడు సాధారణ నీటిని కలపండి . స్నానం చేయండి. దీని వల్ల శరీరం పసుపు రంగులోకి మారదు. పసుపు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందుతారు.

గంధం
మానసిక శాంతి కోసం స్నానం చేసే నీటిలో చందనం ఉపయోగించవచ్చు. దీని సువాసన మనసుకు విశ్రాంతినిస్తుంది. దీనితో పాటు శరీరం నుండి అలసట మరియు ఒత్తిడిని కూడా తొలగిస్తుంది. ఈ ప్రయోజనాలను పొందడానికి, గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల గంధపు నూనెను కలపండి. ప్రతిరోజూ స్నానం చేయండి.

వేప నూనె
గోరువెచ్చని నీటిలో వేపనూనె కలిపి తలస్నానం చేయడం వల్ల దురదలు, దద్దుర్లు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వేసవిలో లేదా వర్షాకాలంలో తరచుగా సంభవిస్తాయి, అటువంటి పరిస్థితిలో వేప నూనె ప్రయోజనకరంగా ఉంటుంది.

రోజ్ వాటర్
చెమట వాసనతో బాధపడేవారు రోజూ రోజ్ వాటర్‌ను నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇందుకోసం మార్కెట్‌లో లభించే రోజ్ వాటర్‌ను ఉపయోగించవచ్చు లేదా 5-6 గులాబీ రేకులను నీటిలో వేసి మరిగించి రోజ్ వాటర్‌ను సిద్ధం చేసుకోవచ్చు. లేదా స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను కలపవచ్చు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల కూడా బాగా నిద్ర పడుతుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)