Kitchen Hacks: వేసవిలో తినే ఆహారం విషయంలో జాగ్రత్త.. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి..

|

Apr 16, 2024 | 6:14 PM

వీధిలో కనిపించిన పండ్లను ఆహారంగా తీసుకుంటారు.. కనిపించిన చోట నీరుని తాగి దాహార్తిని తీర్చుకుంటారు. అయితే ఇలా పండ్లు, పచ్చి కూరగాయలను తింటే ఒకొక్కసారి అతిసారం బారిన పడవచ్చు. కనుక మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పని సరి. ముఖ్యంగా వేసవిలో పండ్లు, కూరగాయలను సరిగ్గా కడగకుండా తిన్నా.. లేదా  ఉడికించకుండా తిన్నా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో చేపలు, మాంసం కొనుగోలు చేసిన తర్వాత బాగా కడిగి వంట చేస్తారు. ఇదే విధంగా కూరగాయలు, పండ్లు శుభ్రం పరిచే విషయంలో కూడా పాటించాలి.

Kitchen Hacks: వేసవిలో తినే ఆహారం విషయంలో జాగ్రత్త.. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయండి..
Kitchen Hacks
Follow us on

వేసవి కాలంలో తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు  అజీర్ణ ససమస్య, కడుపు నొప్పి తో బాధపడుతూ ఉంటారు. సెలవులు వచ్చేశాయి.. దీంతో చిన్నారులు సరదాగా గడిపే సమయం కూడా ఇదే.. అంతేకాదు తమకు వీధిలో కనిపించిన పండ్లను ఆహారంగా తీసుకుంటారు.. కనిపించిన చోట నీరుని తాగి దాహార్తిని తీర్చుకుంటారు. అయితే ఇలా పండ్లు, పచ్చి కూరగాయలను తింటే ఒకొక్కసారి అతిసారం బారిన పడవచ్చు. కనుక మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పని సరి. ముఖ్యంగా వేసవిలో పండ్లు, కూరగాయలను సరిగ్గా కడగకుండా తిన్నా.. లేదా ఉడికించకుండా తిన్నా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మార్కెట్‌లో చేపలు, మాంసం కొనుగోలు చేసిన తర్వాత బాగా కడిగి వంట చేస్తారు. ఇదే విధంగా కూరగాయలు, పండ్లు శుభ్రం పరిచే విషయంలో కూడా పాటించాలి. అయితే పండ్లు,  కూరగాయలు కడగడం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి.. అవి ఏమిటో తెలుసుకోండి..

పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్ నీటిని ఉపయోగించవద్దు. ఇలా చేయడం వలన  ఆహారంలోని పోషక విలువలు తగ్గిపోతాయి. పండ్లను సబ్బు నీటిలో కడిగే బదులు.. చాలా పరిశుభ్రమైన నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో పండ్లను, కూరగాయలను వేసి కొంచెం సేపు నానబెట్టండి. మురికి పోయి శుభ్రం అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని కుళాయి తెరిచి నీటిని పట్టండి.. ఇప్పుడు పండ్లు, కూరగాయల మీద ఉన్న దుమ్ము, ధూళి, బాక్టీరియా పోతాయి.

పండ్లు, కూరగాయలు శుభ్రం చేయడానికి మృదువైన బ్రష్ ఉపయోగించండి. మృదువైన బ్రష్‌తో పండు లేదా ధాన్యాన్ని స్క్రబ్ చేయండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగండి. ఆపిల్, కీర దోస, టమోటా, క్యారెట్, పుచ్చకాయ, జామ వంటి పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆకు కూరగాయలు కూడా శుభ్రం చేసుకోవాలంటే ముందుగా మట్టి,  కీటకాలను ఉన్న ఆకులను కట్ చేసి తీసివేయండి. తర్వాత వాటిని నీటిలో కాసేపు నానబెట్టండి. కావాలనుకుంటే కూరగాయలను కట్ చేసి ఆపై వాటిని శుభ్రంగా కడగాలి. అప్పుడు వాటిని జల్లెడ వంటి గిన్నెలో వేసి నీటిని వడకట్టండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..