Jeera Benefits: మీ వంటింట్లోనే సర్వరోగ నివారిణి.. జీలకర్రతో ఆ సమస్యలన్నిటికీ చిటికెలో రిలీఫ్..

జీలకర్ర భారతీయ వంటశాలలలో ప్రధానమైన మసాలా దినుసు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీలకర్రను ఎన్నో రకాల సమస్యలకు విరుగుడుగా తీసుకుంటారు. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో థైమోల్, కుమినాల్డిహైడ్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జీర్ణ సమస్యలను తగ్గించే యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా దీనిని శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

Jeera Benefits: మీ వంటింట్లోనే సర్వరోగ నివారిణి.. జీలకర్రతో ఆ సమస్యలన్నిటికీ చిటికెలో రిలీఫ్..
Jeera Benefits for Health

Updated on: Feb 24, 2025 | 10:38 AM

జీలకర్రపై 2023లో జరిపిన ఒక అధ్యయనంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కనుగొన్నారు. జీలకర్ర వల్ల బరువు తగ్గడం, చర్మ ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, క్యాన్సర్ నిరోధక కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టేంత అద్భుతమైన ప్రయోజనాలున్నాయని కనుగొన్నారు. జీలకర్ర గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు, క్యాన్సర్ నిరోధక లక్షణాలను అధికంగా కలిగి ఉన్నాయి. జీర్ణక్రియ, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలపై ఇవి ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతున్నాయని తేలింది. జీలకర్రను ఆహారంలో చేర్చుకోవడం అంటే మొత్తం ఆరోగ్యాన్ని గాఢిలో పెట్టుకోవడమే అని పరిశోధకులు తెలిపారు.

కడుపు ఉబ్బరం నుంచి చిటికెలో రిలీఫ్..

అధ్యయనం ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ హెల్త్ సైన్సెస్‌లో ప్రచురించారు. వీటి నుంచి పూర్తి బెనిఫిట్స్ పొందడానికి వీటిని పచ్చివే నోటిలో వేసుకుని నమలొచ్చు. లేదా నీటిలో మరిగించుకుని కూడా తీసుకోవచ్చు. రెండి పద్ధతులు రెండు విభిన్న ప్రయోజనాలను అందిస్తాయి. జీలకర్రను నమలడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరుగుతుంది. జీర్ణక్రియను నేరుగా ప్రేరేపిస్తుంది. లాలాజలంలో విడుదలయ్యే ఎంజైమ్‌లు ఆహారాన్ని మరింత సమర్థవంతంగా విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని తగ్గిస్తాయి.

కడుపు నొప్పి, వాంతులకు చెక్..

జీలకర్ర నమలడం వల్ల నోటి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. జీలకర్రలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి నోటి బాక్టీరియాతో పోరాడటానికి, దుర్వాసన చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి. నమలడం వల్ల చిగుళ్లలో రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది, మొత్తం నోటి ఆరోగ్యానికి ఇది తోడ్పడుతుంది. మీరు మార్నింగ్ సిక్‌నెస్‌తో ఇబ్బంది పడుతుంటే, జీలకర్ర మీకు మంచి ఔషధం. ఇందులోని సుగంధ సమ్మేళనాలు వికారం, మార్నింగ్ సిక్‌నెస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. వీటిని నోటితో నమలడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది, వాంతులు నివారించబడతాయి.

అతిగా వాడకండి…

జీలకర్రను అతిగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. అతిగా తినడం వల్ల నోరు, గొంతులో ఆమ్లత్వం లేదా చికాకు వస్తుంది. జీరా నీటిలో ఫైబర్ మాత్రమే సమృద్ధిగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో జీరా నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది, ఉబ్బరం, గుండెల్లో మంట, అజీర్ణం తగ్గుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని కూడా ప్రోత్సహిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీరా నీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఒక అద్భుతమైన మార్గం.

ఎలా తీసుకుంటి ఎలాంటి బెనిఫిట్..

ఇది శరీరంలోని విషాలను బయటకు పంపుతుంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. మూత్రపిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఎక్కువ జీరా నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. వీటిలో ఏది ఆరోగ్యకరమైనది? మీకు జీర్ణక్రియ నోటి ఆరోగ్యం ప్రాథమిక సమస్యలు అయితే, జీలకర్ర నమలడం మంచిది. ఒకవేళ హైడ్రేషన్, డీటాక్సిఫికేషన్, జీవక్రియను పెంచుకోవాలనుకుంటే మాత్రం జీలకర్ర నీటీని మరిగించి తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.