AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetarian Meat: నాన్‌ వెజ్‌ తినని వారికి అద్భుత వరం ఈ పండు.. ఏడాదికొక్కసారి తింటే క్యాన్సర్ జన్మలో రాదు!

బంగారు రంగులో సువాసనలు వెదజల్లే పనస తొనలను ఎవరు ఇష్టపడరు చెప్పండి.. నిజానికిది సీజనల్ పండు. అందుకే డిమాండ్ కూడా కొంచెం ఎక్కువే. ఇది రుచిని పెంచడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, మాంసానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు సైతం చెబుతున్నారు.,

Vegetarian Meat: నాన్‌ వెజ్‌ తినని వారికి అద్భుత వరం ఈ పండు.. ఏడాదికొక్కసారి తింటే క్యాన్సర్ జన్మలో రాదు!
Jackfruit
Srilakshmi C
|

Updated on: May 07, 2025 | 9:31 PM

Share

పనస పండులో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంటా ఉంటాయి. అందుకే వీటిని విరివిగా వినియోగిస్తారు. అనేక రకాల ఆహారాలలో కూడా ఉపయోగిస్తుంటారు. దీని వాసన ఆహార రుచిని రెట్టింపు చేస్తుంది. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

జాక్‌ఫ్రూట్ ఎందుకు తినాలి?

ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఎలక్ట్రోలైట్లు, ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. పనస పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. పనస పండు పోషకాలతో పాటు పొటాషియం, ఫైబర్‌ను అధికంగా కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. పనస పండులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దాని విత్తనాలలోని ఈ సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

పనస పండులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పనసకాయను మితంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పనస పండు అధిక రక్తపోటును నియంత్రించడమే కాకుండా, గుండె సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పనస పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, అజీర్ణం, మలబద్ధకం సమస్యలను క్రమంగా తొలగిస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో కనిపించే ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించడంలోనూ సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.