Self Hydration Tips: వేసవిలో ఈ ఫ్రూట్స్ తింటే ఇంత మేలా.! పోషకాలు అధికంగా ఆ పండ్లు ఏంటో తెలసుకోండి..

వేడి వల్ల నిర్జలీకరణం, చర్మ సున్నితత్వం, విటమిన్, మినరల్ లోపాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలోని ప్రతి వ్యవస్థ సమర్ధవంతమైన పనితీరుకు నీరు అవసరం. అయితే దీని కోసం కానీ నీరు తాగడం ఒక్కటే పరిష్కారం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Self Hydration Tips: వేసవిలో ఈ ఫ్రూట్స్ తింటే ఇంత మేలా.! పోషకాలు అధికంగా ఆ పండ్లు ఏంటో తెలసుకోండి..
Fruits

Updated on: May 12, 2023 | 5:30 PM

సాధారణంగా భారతదేశంలో ఎండలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఎండల వల్ల మనం త్వరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో మనం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అత్యవసరం. ఎందుకంటే వేడి వల్ల నిర్జలీకరణం, చర్మ సున్నితత్వం, విటమిన్, మినరల్ లోపాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మన శరీరంలోని ప్రతి వ్యవస్థ సమర్ధవంతమైన పనితీరుకు నీరు అవసరం. అయితే దీని కోసం కానీ నీరు తాగడం ఒక్కటే పరిష్కారం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మనల్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉంచడానికి పండ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎండలోకి వెళ్లి వస్తే శరీరంలోని నీటి శాతం తగ్గింపోతుంది. అందువల్ల వేసవి కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి తగిన పోషకాహారం అందించడంతో పాటు నీటిని అందించవచ్చు. అలాగే పండ్లల్లో తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి ఎలాంటి చింతా లేకుండా మనం వీటిని తినవచ్చు. వేసవిలో పోషకాహార నిపుణులు సూచించే పండ్లు గురించి ఓ సారి తెలుసుకుందాం. 

మామిడి పండ్లు

మామిడిపండ్లు నిస్సందేహంగా వేసవి కాలంలో అత్యంత రుచికరమైన పండల్లో ఒకటిగా ఉంటాయి. మామిడి పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తాయి. అలాగే కంటి చూపును మెరుగుపరుస్తాయి.

పుచ్చకయ

నీరు, ఎలక్ట్రోలైట్స్‌లో పుష్కలంగా ఉండే  పుచ్చకాయ వేడి వాతావరణానికి హైడ్రేషన్ నుంచి బయటపడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్-ఏ, సీ ఉన్నాయి. పుచ్చకాయ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

పైనాపిల్

సహజ తీపిదనంతో అద్భుతంగా ఉండే పైనాపిల్ వల్ల కూడా వేసవిలో శరీరానికి చాలా మేలు జరుగుతుంది. పైనాపిల్‌లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. పైనాపిల్‌లో ఉండే ఇతర ప్రోత్సాహకాలు అంటే ముఖ్యంగా బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.  ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియలో కూడా సహాయపడుతుంది.

ద్రాక్ష

ద్రాక్ష పండ్లల్లో ఉండే 81 శాతం వాటర్ కంటెంట్ శరీరాన్ని రోజంతా హైడ్రేట్ గా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు ఏ, సీ కాకుండా, ద్రాక్షలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌ను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది.

నారింజ, కమలా ఫలం

నారింజ అంటే పుల్లగా ఉండే పండు ఇందులో ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే సిట్రస్, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. నారింజ, కమలాా ఫలంలో అధికంగా తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్-సి అధికంగా ఉండడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..