Travelers Money Saving Tips: టూర్‌కు వెళ్లినప్పుడు ఆ విషయంపై దృష్టి తప్పనిసరి.. మహిళా ట్రావెలర్స్‌కు నిపుణుల సూచనలు

|

Oct 11, 2024 | 8:59 PM

ఒంటరి ప్రయాణం అనేది ఒక ఉత్తేజకరమైన, ప్రత్యేకమైన అనుభవం. ఇటీవల విడుదులైన డేటా ప్రకారం దాదాపు 30 శాతం మంది భారతీయ మహిళా ప్రయాణికులు అంతర్జాతీయ, దేశీయ టూర్లను ఒంటరిగానే చేస్తున్నారని వెల్లడైంది. అయితే ఒక్కరే ప్రయాణాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ప్రయాణాన్ని సాఫీగా, ఒత్తిడి లేకుండా చేయడానికి డబ్బు నిర్వహణలో నైపుణ్యం సాధించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Travelers Money Saving Tips: టూర్‌కు వెళ్లినప్పుడు ఆ విషయంపై దృష్టి తప్పనిసరి.. మహిళా ట్రావెలర్స్‌కు నిపుణుల సూచనలు
Women Solo Travel
Follow us on

ఒంటరి ప్రయాణం అనేది ఒక ఉత్తేజకరమైన, ప్రత్యేకమైన అనుభవం. ఇటీవల విడుదులైన డేటా ప్రకారం దాదాపు 30 శాతం మంది భారతీయ మహిళా ప్రయాణికులు అంతర్జాతీయ, దేశీయ టూర్లను ఒంటరిగానే చేస్తున్నారని వెల్లడైంది. అయితే ఒక్కరే ప్రయాణాలు చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు మీ ప్రయాణాన్ని సాఫీగా, ఒత్తిడి లేకుండా చేయడానికి డబ్బు నిర్వహణలో నైపుణ్యం సాధించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా ట్రావెలర్స్‌కు మనీ మేనేజ్‌మెంట్ విషయంలో నిపుణులు చెప్పే సూచనలను తెలుసుకుందాం. 

బడ్జెట్‌ ప్లాన్ 

పటిష్టమైన ప్రణాళికతో మీ టూర్‌ను ప్రారంభించాలి. మీ రోజువారీ ఖర్చులను అంచనా వేయాలి. వసతి, ఆహారం, రవాణా, రోజువారీ కార్యకలాపాలపై అవగాహనతో ఉండాలి. అనుకోని సంఘటనల నుంచి కవర్ చేయడానికి ప్రయాణ బీమా తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు. బాగా ఆలోచించి బడ్జెట్ నిర్ణయించుకుంటే మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో, ఒత్తిడి లేకుండా మీ ప్రయాణాన్ని ఆస్వాదించడంలో మీకు సహాయపడుతుంది.

తక్కువ ఎక్కువ విధానం

మీ నగదుతో ‘తక్కువ ఎక్కువ’ అనే ఆలోచనను స్వీకరించడం ద్వారా స్మార్ట్‌గా ప్రయాణించవచ్చు. ప్రయాణంలో సురక్షితంగా ఉండటానికి రోజుకు మీకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకెళ్లండి. అలాగే నగదును కూడా వివిధ సురక్షిత ప్రదేశాలలో నిల్వ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎంత ఆన్‌లైన్ ట్రాన్స్‌యాక్షన్‌లు ఉన్నా భౌతిక నగదును కొంత మొత్తం అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

బ్యాంకు ఫీజులు

మీరు టూర్‌కు వెళ్లే ప్రాంతంలో ఏవైనా కొనుగోలు చేసినప్పుడు మీ కార్డులను స్వైప్ చేసే ముందు మీ బ్యాంక్ కార్డ్ ఫీజు గురించి తెలుసుకోవాలి. క్రిస్టల్-క్లియర్ ఫారిన్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు, సూటిగా ఎక్స్ఛేంజ్ రేట్లతో కార్డ్‌లను స్కౌట్ చేయండి. మీరు కొనుగోలు చేసినా లేదా ఏటీఎం నుంచి నగదు తీసుకున్నా హిడెన్ చార్జీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డైనమిక్ కరెన్సీ మార్పిడి నివారించాలని సూచిస్తున్నారు. 

స్కామ్‌లపై జాగ్రత్తలు

ప్రతి ప్రాంతంలో కొత్త వారిని మోసగించి డబ్బును తస్కరించేందుకు ముష్కరులు మన చుట్టూనే ఉంటారు. కాబట్టి మీరు ఏ ప్రాంతానికి టూర్‌కు వెళ్లాలనుకుంటున్నారో? ఆ ప్రాంతంలో తరచూ జరిగే మోసాల గురించి ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం. అనుకోని సందర్భం వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి? అనే విషయంపై ముందుగానే ఉపాయాలతో ఉండవచ్చు.

ఆఫ్ పీక్ ప్రయాణం

ఆఫ్-పీక్ సీజన్లలో ప్రయాణించడం వల్ల విమానాలు, హోటళ్లు వంటి ఖర్చులు తగ్గుతాయి. వాతావరణం చాలా బాగున్నా జనాలు తక్కువగా ఉన్నప్పుడు టూర్  ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.  ఈ విధానంతో మీ బడ్జెట్‌లోనే టూర్‌ను కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది. 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..