Telugu News Lifestyle Is Your Child Asking Too Many Questions? Don’t Get Annoyed! Experts Say It’s a Sign of High Intelligence!
మీ పిల్లలు ‘జీనియస్’ అని చెప్పే 7 లక్షణాలు ఇవే! పేరెంట్స్ తప్పక తెలుసుకోవాలి
కొంతమంది పిల్లలు అసలు నోరు మూయకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే మనకు చిరాకు రావడం సహజం. "అమ్మ ఇది ఎందుకు?", "నాన్న అది ఎలా పని చేస్తుంది?" అంటూ వారు వేసే ప్రశ్నల పరంపరకు మనం ఒక్కోసారి అసహనానికి గురవుతాము.
కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆ విసుగు తెప్పించే ప్రశ్నలే మీ బిడ్డ మేధస్సుకు నిదర్శనం! పిల్లల తెలివితేటలను కేవలం మార్కులతోనే కాకుండా, వారిలో దాగి ఉన్న కొన్ని అరుదైన లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆ ఇంట్లో ఐదేళ్ల బాబు ఉన్నాడు. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూసినట్లు పరిశీలిస్తాడు. “ఆకాశం ఎందుకు నీలంగా ఉంది?”, “కాకి ఎందుకు నల్లగా ఉంది?” అంటూ రోజంతా ప్రశ్నలతో ముంచెత్తుతుంటాడు. తల్లిదండ్రులు విసుక్కొని.. “కాసేపు నోరు మూసుకొని కూర్చో” అని గద్దిస్తారు. కానీ, నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు. ఆ చిన్నారి మెదడు ఒక అద్భుతమైన వేగంతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. పిల్లలు తెలివైన వారో కాదో తెలుసుకోవడానికి ర్యాంకు కార్డులు అవసరం లేదు, వారి రోజువారీ ప్రవర్తనను గమనిస్తే చాలు.
మనకు తెలిసిన విషయాలను మనం తేలికగా తీసుకుంటాం. కానీ పిల్లలకు ప్రతిదీ కొత్తే. ఏ విషయాన్ని అయినా లోతుగా అర్థం చేసుకోవడానికి వారు ‘ఎందుకు’, ‘ఎలా’ అని అడుగుతారు. ఇలా అడుగుతున్నారంటే వారి బ్రెయిన్ చాలా షార్ప్‌గా పని చేస్తోందని అర్థం. కాబట్టి విసుక్కోకుండా వారికి ఓపికగా సమాధానాలు చెప్పాలి.
తెలివైన పిల్లలు పజిల్స్ సాల్వ్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఏదైనా కష్టమైన పని ఎదురైనప్పుడు మధ్యలో వదిలేయకుండా, అది పూర్తయ్యే వరకు శ్రమిస్తారు. సొంతంగా పరిష్కారాన్ని వెతుక్కోవడం వారిలోని మేధస్సుకు ఒక సంకేతం.
మొహమాట పడకుండా తమ ఆలోచనలను ఇతరుల ముందు స్పష్టంగా ఉంచడం ఇంటెలిజెంట్ పిల్లల లక్షణం. వారు తాము ఏం చెప్పాలనుకుంటున్నారో వివరంగా, అర్థమయ్యేలా చెబుతారు.
చాలామంది పిల్లలు ఒంటరిగా ఉంటే భయపడతారు. కానీ తెలివైన పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమాత్రం బోర్ ఫీలవ్వరు. చదవడం, బొమ్మలు గీయడం లేదా సరికొత్తగా ఏదైనా ఊహించడం వంటి పనులతో తమదైన ప్రపంచాన్ని సృష్టించుకుంటారు.
ఒకే పనిని రకరకాలుగా చేయడానికి వారు ప్రయత్నిస్తారు. మూస పద్ధతిలో కాకుండా కొత్తగా ఆలోచించి అద్భుతమైన ఫలితాలను చూపిస్తారు. వారి క్రియేటివిటీని ఆపకుండా ప్రోత్సహించడం తల్లిదండ్రుల బాధ్యత.
ఇది చాలా అరుదైన లక్షణం. తల్లిదండ్రులు బాధలో ఉన్నా లేదా ఏదైనా ఇబ్బందిలో ఉన్నా, వారు చెప్పకుండానే పిల్లలు అర్థం చేసుకుంటారు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే గుణం వారిలో సహజంగానే ఉంటుంది.
పిల్లల తెలివి అంటే కేవలం స్కూలు మార్కులు మాత్రమే కాదు. వారి ప్రవర్తన, అడిగే ప్రశ్నలు, లోకాన్ని చూసే తీరు వారి మేధస్సును ప్రతిబింబిస్తాయి. కాబట్టి మీ పిల్లల ఆలోచనా శైలిని గమనించండి, వారిని ప్రశ్నించనివ్వండి. ఎందుకంటే నేటి ప్రశ్నలే రేపటి ఆవిష్కరణలకు పునాదులు!