Tomato: డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులు టమాటా తినొచ్చా..? కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా..?

|

Sep 08, 2023 | 4:28 PM

టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఇంట్లో మళ్లీ టమాటాలు కనిపిస్తున్నాయి. టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్ ఇ, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ కూడా అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో టమాటాలు..

Tomato: డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులు టమాటా తినొచ్చా..? కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయా..?
Tomato
Follow us on

టమాటా ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఇంట్లో మళ్లీ టమాటాలు కనిపిస్తున్నాయి. టొమాటోలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్ ఇ, థయామిన్, నియాసిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్ కూడా అధికంగా ఉంటుంది. వర్షాకాలంలో టమాటాలు తనడం వల్ల వాటిలోని పోషకాలు ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఐతే కూరగాయలు, టమాటలకు రైతులు అధికంగా పురుగుమందులు వినియోగిస్తుంటారు. అందుకే వీటిని శుభ్రంగా కడిగిన తర్వాతే వినియోగించాలి. సేంద్రీయంగా పెరిగిన టమాటాలను ఎంచుకోవడం ఇంకా మంచిది. 100 గ్రాముల టమాటాల్లో ఏయే పోషకాలు ఉంటాయంటే.. సుమారు 22 కేలరీలు, 4.8 గ్రా కార్బోహైడ్రేట్లు, 3.2 గ్రా చక్కెర, 1.1 గ్రా ప్రోటీన్, 0.2 గ్రా కొవ్వు, 1.5 గ్రా ఫైబర్ ఉంటుంది.

టమాట ఆరోగ్య ప్రయోజనాలు..

ఆహారంలో టమాట తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. LDL కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. టమాటాల్లో ఉండే లైకోపీన్ కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించడానికి సహాయపడుతుంది. వీటిల్లోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. టమాటాల్లో బీటా-కెరోటిన్, లుటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించి, కళ్లకు మేలు చేస్తుంది. అంతేకాకుండా టమాటాల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టమాటల్లోని లైకోపీన్ యూవీ వంటి హానికరమైన కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు టమాట తినొచ్చా?

టమాటాల్లో తక్కువ మొత్తంలో గ్లైసెమిక్ ఉంటుంది. వీటిని మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. అయితే వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి

గర్భిణీ స్త్రీలు తినొచ్చా..?

టమాటాల్లో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు న్యూరల్ ట్యూబ్ అభివృద్ధికి చాలా అవసరం. వీటిల్లోని విటమిన్ సి, పొటాషియం తల్లీబిడ్డలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

కొంతమందికి టమాటా ఎలర్జీ ఉంటుంది. అటువంటి వారు పొరపాటున టమాట తిన్నా చర్మంపై దద్దుర్లు ఏర్పడటమేకాకుండా జీర్ణశయాంతర రుగ్మతలకు కారణం అంవుతుంది. టమాటాల్లో మాలిక్, సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఇది కడుపు నొప్పికి దారితీస్తుంది. టమాటాల అధిక వినియోగం జీర్ణశయాంతర సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొంతమంది టమాటాలు తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. టమాటాల్లో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. అలాగే వండిన వాటి కంటే పచ్చి టమోటాలు మంచివని, వండకుండా పచ్చిగానే తింటే ఆరోగ్యానికి ఎక్కువ మేలు జరుగుతుందని నమ్ముతారు. నిజానికి టమాట ఉడికించడం వల్ల లైకోపీన్ లభ్యత పెరుగుతుంది. టమాటా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయనే అపొహలు కూడా చాలా మందిలో ఉన్నాయి. టమాటాల్లోని ఆక్సలేట్‌లు అధికంగా ఉన్నప్పటికీ వీటిని మితంగా తినడం వల్ల ఎలాంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.