కొత్త బట్టలు ఉతకకుండా ఎందుకు వేసుకోకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారు?

| Edited By: Janardhan Veluru

Dec 20, 2024 | 3:44 PM

కొత్త బట్టలు ఉతికి వేసుకోవాలా? ఉతక్కుండా వేసుకోవాలా? అనే సందేహం అందరికీ ఉంటుంది. ఇంట్లో పెద్ద వాళ్లు కూడా ఉతికిన తర్వాతే కొత్త బట్టలు వేసుకోవాలని చెబుతారు. ఈ నేపథ్యంలో అసలు ఉతికి వేసుకుంటే మంచిదా? అలాగే ధరిస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ఓసారి తెలుసుకుందాం..

కొత్త బట్టలు ఉతకకుండా ఎందుకు వేసుకోకూడదు..? నిపుణులు ఏం చెబుతున్నారు?
New Cloths
Follow us on

కొత్త బట్టలంటే అందరికీ సంబరమే. కొనుక్కున్న వెంటనే ఎప్పుడెప్పుడు వేసుకుందామా? అనే అందరూ ఆలోచిస్తారు. కానీ, షాప్​ నుంచి తెచ్చాక వాటిని ఉతికి వేసుకోవాలా? ఉతక్కుండా వేసుకోవాలా? అనే సందేహం అందరికీ ఉంటుంది. ఇంట్లో పెద్ద వాళ్లు కూడా ఉతికిన తర్వాతే కొత్త బట్టలు వేసుకోవాలని చెబుతారు. ఈ నేపథ్యంలో అసలు ఉతికి వేసుకుంటే మంచిదా? అలాగే ధరిస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు? ఓసారి తెలుసుకుందాం..

చర్మ వ్యాధులకు ఎక్కువ ఆస్కారం

మనం ప్రత్యేక సందర్భాల్లో కొత్త బట్టలు కొంటూనే ఉంటాం. పెద్దవాళ్లు వాటిని ఉతికిన తర్వాతే వేసుకోమని చెప్తారు. ఇందులో నిజం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. షాపులో కొన్న కొత్త బట్టలపై హానికర రసాయనాలు ఉంటాయట. వాటిని ఉతికి ఎండలో ఆరేస్తే అవి పోతాయని అంటున్నారు. అంతేకాకుండా వాటిని ఇస్త్రీ చేసుకుని ధరిస్తే మరింత మంచిదని చెబుతున్నారు. కానీ, అవేమీ పట్టించుకోకుండా అలాగే వేసుకుంటే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధులు సోకే ప్రమాదం

కొత్త బట్టలను ఉతకకుండా వేసుకుంటే అలర్జీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అమెరికా జాతీయ ఆరోగ్య సేవా సంస్థ (ఎన్​హెచ్​ఎస్) సూచిస్తున్నాయి. బట్టల షాపుల్లో సైజు కోసం చాలా మంది ట్రయల్స్​ వేస్తుంటారు. అలాంటి బట్టలను తప్పకుండా ఉతికిన తర్వాతే ధరించడం వల్ల అనేక రకాల బ్యాక్టీరియా మన దరికి చేరకుండా ఉంటుంది. అలాగే ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే మహమ్మారుల బారిన పడకుండా ఉంటామని ఎన్​హెచ్​ఎ​స్ సూచిస్తోంది.

చర్మ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కొత్త బట్టలను అలాగే వేసుకోవడం వల్ల ‘కాంటాక్ట్​ డెర్మటాటిస్’ అనే అతి పె​ద్ద ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని చర్మ వ్యాధి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సోకిన వారిలో చర్మం పొలుసులుగా మారి దురద పెడుతుంది. బట్టలు వేసుకున్న కొన్ని గంటల్లోనే దీన్ని గుర్తించవచ్చు. ఇది సోకితే చర్మం ఎర్రగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది. అందువల్ల కొత్తగా కొన్న దుస్తులను ఉతికిన తర్వాతే వేసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.